పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

ఘటికాచలమాహాత్మ్యము


శ్రీపతి యభిముఖ భావమె
యేపున నాహనాఖ్య నెసఁగు ధరిత్రిన్.

39


క.

అనవుడు భృగుఁ డిట్లను వి
ష్ణుని బూజ యొనర్చు ధరణిసురులకు ప్రాపిం
చును [1]మఱి దేవత్వం బని
జనులాడుదు రవ్విధంబు చయ్యనఁ జెపుమా!

40


క.

అనవుడు నారదుఁ డిట్లను
ఘనులగువీరల కొసంగె కమలోద్భవుఁడీ
యనుపమ పూజావర్తన
మును మును గావునను నదియుఁ [2]బొందదు వారిన్.

41


గీ.

కూలిగొని చేయువారి కా కొదవ గలదు
నొండుచో ఖండితారివేదండుఁ డైన
శ్రీనృసింహుని[3]తో నది చెల్ల దెపుడు
మౌనినాయక యిది సత్యమైన పలుకు.

42


సీ.

ఒక నాడు సంశయయుక్తచిత్తు లగుచు
సకలవైఖానసుల్ సాధుచిత్తుఁ
డవ్వసిష్ఠుఁడు విన ననఘ మే మిచ్చట
నివ్వటిల్లినవేడ్క నిలచుటెట్టు
లనిన నమ్ముని వారికనియె నో ఘనులార
యి మ్మహాహరియుండునెడలు తఱచు
రాణించు బదరికాశ్రమము సాలగ్రామ
ధరణీధర మయోధ్య ద్వారకయును
కాశి మధురయు నైమిశ కాననం బ
వంతినారాయణాఖ్యపర్వతము నీల
గిరి కురుక్షేత్రమును గాంచిపురము వెలయు
హరివసతులందు సుప్రసిద్ధంబు లగుచు.

43
  1. దేవతల కత్వం. తా.
  2. బొందుదు. తా. పూ. ము.
  3. చో. తా. పూ.ము.