పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

115


విఖన సాంగత్యమునఁ జేసి విఖనసుండు
బొడమి రాయన్వయంబునఁ బుట్టు గనిన
వేదశాస్త్రార్థనిరతులు విప్రవర్యు
లఖిలమంత్రతంత్రార్థరహస్యవిదులు.

35


క.

పంచవిధబేరపూజా
చుంచువులై వార లెపుడు శుద్ధాత్మకులై
పంచాయుధ శోభితు నర
పంచాస్యునిఁ గొలుచుచుండ్రు భాగ్యము కలిమిన్.

36


క.

[1]అన భృగుఁడు పంచబేరా
ర్చనతెఱఁ గెఱింగింపు మనుచుఁ బ్రార్థించుడు న
య్యనిమిషసంయమి యాదర
మున నిట్లనిపలికె నధికమోదం బెసఁగన్.

37


సీ.

ఘనతేజ ధృవకౌతుకస్నాపనోత్సవ
బల్యంబులివి బేరపంచకంబు
పరఁగు నాఱవయది [2]బాలాల[3]యాహ్వయం
బదియ సూ పాంచరాత్రాభిదంబు
వరుస శ్రీకృష్ణుండు పురుషుండు సత్యుండు
నచ్యుతుండును [4]బుద్ధుఁ డనఁగ నందు
నావాహ్య[5]లల్లధ్రువాదిగా నుత్తరో
త్తర[6]బేరములయందు వరుస సేయ.
వలయు నావాహనం బని పలుక భృగుఁడు
నారదున కిట్టులనియెను గౌరవమున
నాద్యబేరంబు నావాహనాదికముల
నితరబేరంబుఁ జెందుట యెట్టు లనిన.

38


క.

దీపంబువలన వేఱొక
దీపము గలుగంగ రెంటఁ దేజము లేదే

  1. అని. పూ. ము. తా.
  2. వాలాల. పూ. ము. తా.
  3. పర్వతంబది సూవె. పూ. ము.
  4. బుద్దు ....లవ్వి.
  5. లల్లి. తా.
  6. భేదము. పూ. ము. ఈభాగము పూర్వముద్రణమున పూర్తిగా లేదు.