పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

113


వెలయుదురుగాత యని తను వేడికొనిన
మునులపై నుడివోవని కనికరమున
నట్లెయొనరింతు నే నని యానతిచ్చె
ఛిన్నసుజనార్తి శ్రీనరసింహమూర్తి.

26


క.

[1]హరుఁడు విరించియు నపుడ
గ్గిరిమాహాత్మ్యము నృసింహుకృప మునిభాగ్య
స్ఫురణము మెచ్చుచు తమ మం
దిరములకుం జనిరి మదిని నివ్వెఱ యొదవన్.

27


గీ.

అంత [2]వైఖానసులు వసుధామరాగ్ర్యు
లజుని పంపున సంతసం బావహిల్ల
వచ్చి హరినామసరసుల వారిఁ గ్రుంకి
ధౌతపటములు కటితటి: దాల్చి నిల్చి.

28


క.

మల్లియలు కమలసుమనో
వల్లరులును గన్నెరులును వాసంతికముల్
హల్లక పాటలములు ను
త్ఫుల్లవకుళ చంపకములు పొరిపొరి గొనుచున్.

29


సీ.

దేవతాగృహము సద్భావంబుతోఁ జొచ్చి
స్వస్తికా[3]సనముల వరుసనిలిచి
[4]ధౌతులై దేహశోధన మాచరించి ప్రా
ణాయామపరతమై యంతరంగ
మేకాగ్రముఁగఁ జేసి యెలమితో సంకల్ప
కల్పిత వస్తునికాయమునను
మానసపూజ నేమంబున గావించి
యావాహ నాస నార్ఘ్యాది విధులు
గంధ సుమ ధూప దీపాదికముల
[5]మధురనైవేద్యవీటీసమర్పణముల

  1. హరియు. పూ. ము. తా.
  2. వైమానసులు. పూ.ము. తా.
  3. సరములు తా.
  4. ధాతు. తా.
  5. మఱియుమధుర. పూ. ము.