పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ఘటికాచలమాహాత్మ్యము


నాటపాటల పూజనం బాచరించి
[1]రనిన నారదునకు భృగుఁడనియె నపుడు.

30


గీ.

సకలజీవాంతరాత్మయౌ శౌరి కెట్లు
వసుధ నావాహనంబు నుద్వాసనంబు
గలుగు నదియెల్ల నానతీవలయు ననిన
నింపుసొంపార నారదుఁ డిట్టు లనియె.

31


మ.

విను దైత్యాంతకుఁ డంతరాత్మ యగుచున్ వేఱొండుచోను న్వసిం
పును లోకంబులనిండియున్నశిఖి యేపోల్కిన్ శమీగర్భమం
దును గానంబడు నట్ల బింబగతుఁడై తోడ్తోడ నావాహనం
బును నుద్వాసన మమ్మహామహుఁడు సంపూర్ణస్థితిన్ గైకొనున్.

32


క.

అనవుడు భృగుముని యిట్లని
యెను వైఖానసు లనంగ నెవ్వరు చెపుమా
వినవలతు ననిన నారద
ముని యిట్లను నాదరంబు ముప్పిరి గొనఁగన్.

33


క.

ఇది గోప్యము [2]కలుషహరము
విదితంబుగ దీని తెఱఁగు వింటి తొలుత నీ
కది యిపుడు తెలియ వినిపిం
చెద నవధానముగ వినుము శిష్టజనాఢ్యా!

34


సీ.

అనఘ! నిరుక్తవేదాంగోక్తమై ధర
పొగడొందు నీకథ పుణ్యయగుచు
నంబుధీశ్వరుని యాగంబున జలదద
యనెడు నచ్చరఁ జూడ నజుని కపుడు
వీర్యంబుజారఁ దద్వీర్యం [3]బతఁడు పర్ణ
పుటి నించి వహ్నిలోఁ బోయ నందు
నర్చియును భృగుండు నంగారపిండంబు
నం దంగిరుండును నత్రి మునియు

  1. కనిన. తా.
  2. ఈ పాదార్ధము తాళపత్రమున లేదు.
  3. బితడు. పూ.ము. తా.