పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111


క.

మెచ్చితి మిము మునులారా
నొచ్చితి రిన్నాళ్లు తడసి నొగలకుఁ డిఁక మీ
కిచ్చెదఁ గోరినవరములు.
నిచ్చలముగ మీతపంబు నేడు ఫలించెన్.

18


వ.

అనిన నమందానందకందళితహృదయారవిందులై యమ్మహర్షు
లిట్లనిరి.

19


క.

పురహర పురందరాది క
దురధిగమంబై భవాదిదూరమ్మగు నీ
యురుమూర్తిఁ గనుటకంటెను
వర మెయ్యది వరముగలదు వర్ణింప నజా!

20


గీ.

ఉర్వి నమృతఫలాఖ్య భక్తోచితాఖ్య
గలిగె నేకతమున నీకు కలుషదూర!
వినఁగఁ గోరెద మెఱింగింపవే యటన్న
ఋషుల కిట్లని పలికె సర్వేశ్వరుండు.

21


క.

అమృతము మోక్షము తత్ఫల
మమరిచి యమృతఫలనామ మందితి ధరణిన్
శమయుక్తభక్తకాంక్షిత
మమరిచి భక్తోచితాఖ్య నటు గైకొంటిన్.

22


క.

ఈ పర్వతశిఖరమ్మున
దీపించుచునుండు రెండుతీర్థము [1]లివియున్
ప్రాపించు నేతదాఖ్యలె
తాపసవరులార! సార్థతానయయుక్తిన్.

23


సీ.

దివ్యమౌనీంద్రు తీర్థంబులోఁ గ్రుంకి
ధన్యులై కడుమహత్త్వంబుఁ గనిరి
ఎవ్వరు మద్భక్తు లిందు మజ్జనమాడ
నవవర్గసంప్రాప్తి కర్హులగుదు

  1. లవియున్. పూ. ము. తా.