పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఘటికాచలమాహాత్మ్యము


తనపేరు వెలయింపఁదలఁచి నాపే రెన్న
వినక పుట్టిన పిన్నతనయవర్యు
మామకభక్తి మగ్రుని ప్రహ్లాదుఁ
దీవ్రనిస్పృహ ఘోరదృష్టిఁ జూచి
హరి వినుతించిన హరియింతునే నిన్ను
హరి వైరిసు మ్మోరి యసురులకును
నని యెఱుఁగఁజెప్పి తనమాట వినకయున్న
తనయు ఘనరోషకలుషచేతస్కుఁ డగుచు
కనికరంబింతయునులేక కఠినవృత్తి
చంపఁ దలపోసి మదిలోన తెంపుఁ జేసి.

15


సీ.

కత్తుల మొత్తించి గంధద్విపముల మొ
త్తమ్ముల కొమ్ములఁ గ్రుమ్మఁజేసి
ఫణులచేఁ గఱపించి పావకశిఖలలోఁ
బొరలఁ ద్రోయించి యంబుధుల ముంచి
కట్టించి కొట్టించి కాఁచిన [1]కారులఁ
బట్టించి ధట్టించి గట్లచరుల
ద్రొబ్బించి నరకాగ్ని దూలించి దానవ
భటులచే నొంచి యిప్పాట్లఁ బఱచె
బాలుఁ డలయఁడు సొలయఁడు
[2]మదిని నాయందు భక్తి యేమరఁడు విష్ణు
పక్షమును మానితినటంచుఁ బలుకనొల్లఁ
డేమి చెప్పుదు నబ్బాలు హృదయశుద్ధి.

16


గీ.

అతనిఁగావ సభాస్తంభమందు వెడలి
కడిఁదిఱక్కసు వెడద వక్షంబు వాడి
గోళ్ల విదలించి యవనిపైఁ గూల్చి కరుణ
బాలు రక్షించితిని మునిప్రవరులార!

17
  1. వారుల. తా.
  2. మదిని.... పక్షమును- ఈ భాగము పూర్వముద్రణమున లేదు.