పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఘటికాచలమాహాత్మ్యము


కనక నికేతనాకలిత కేతన[1]పటీ
పల్లవాంకిత దిశాపతి పురంబు
ప్రతిమందిరాళిందభాగ ముక్తాఫల
రంగవల్లీ విభారాజితంబు
నీలమణిజాల కీలితోన్మీల దభ్ర
చుంబిహర్మ్య కదంబ నీలాంబుద భ్ర
మాప్రదాలోక నర్తితామర వనాహి
భుగ్వితానంబు కాంచికాపురవరంబు.

197


క.

కనుపట్టుటయుఁ దదాలో
కన[2]పరయగు నిజవధూటి కాంక్షయెఱిగి య
వ్వనితామణికి వసిష్ఠుం
డనియెన్ మందస్మితాననాబ్జుండగుచున్.

198


క.

ఈపురము ధారుణీమణి
నూపురము సమస్తజనమనోరథసిద్ధి
శ్రీపురము గోపురస్థిత
గోపురము వినీలకుటిలకుంతల కంటే!

199


ఉ.

నీడలు దేరు గారుడమణీగణ కుట్టిమసీమ [3]నాథులం
గూడి చరించు పట్టణము కొమ్మలు తత్ప్రతిబింబితాంబర
క్రీడదమర్త్యరాజనగరీసురజంపతిరూపురేఖ లే
జోడని సారె గీలి గొనఁజూతురు సౌధవిహారవేళలన్.

200


శా.

రాకారాత్రుల చంద్రకాంతరచితప్రాకారవారంబులు
ల్లోకప్రక్రియలం గరంగఁగఁ బ్రణాళుల్ నిండి యశ్రాంతధా
రాకారంబున [4]బారునీరు రతినాథాటోపసస్యావన
శ్రీకిం జంద్రు డొనర్చు కాల్వలన వర్తించున్ పురీవీథులన్.

201


ఉ.

సారసలోచనల్ నగరసౌధవిధూపలవేదులందు సం
చారము సేయుచున్ నికట సౌరధునీ కనదంబుజంబు లెం

  1. పటా. పూ. ము.
  2. వర. తా.
  3. ధాతులం. తా.
  4. జారు తా.