పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

91


తే రతిఁ గోయఁ బో నచట ద్రిమ్మరు తేంట్లు ముఖారవిందముల్
జేర వెఱం దొరంగుదురు చెంతల కాంతలు గేలి సేయఁగన్.

202


శా.

శ్రీకల్యాణ మహోత్సవాచరిత ధాత్రీ[1]వేదినిక్షిప్తదీ
ప్రాకా[2]రోన్నత కాయమాన భవనవ్యాపారపారీణతా
స్తోక స్తంభమతిప్రదాతృసకలస్తోతవ్య మాణిక్యసౌ
ధాకారాంచిత మీ పురంబు నుతిసేయన్ శక్యమే యేరికిన్.

203


మ.

పురి యభ్రంకషసౌధపంక్తి గని వేల్పుందంతి శైలాళియం
చు రహిం గొమ్ములఁ ద్రవ్వి యాడుటకు నచ్చోఁ జేరి యందుగ్రవై
ఖరి గన్పట్టెడు కృత్రిమేభరిపు[3]సంఘంబున్ నిరీక్షించి వే
వెఱఁ బాఱున్ వెలవెల్లనై యనిమిషుల్ నిర్విణ్ణులై చూడఁగన్.

204


గీ.

పురముమేడలనుండి యంభోజముఖులు
కమ్మకస్తురి వేలుఁపు[4]గొమ్మమూక
కర్పణము సేసి వారిచే నందికొండ్రు
[5]ననుపుఁదావుల హరిచందనద్రవంబు.

207


మ.

వలభీంద్రోపలఖండదీధితులఠేవల్ కంఠహాలాహలం
బులు సున్నంబు విభూతి వెల్లపడగల్ మూర్ధస్థితస్వర్ధునీ
జలపూరంబులు లోనగుమ్మరుసతుల్ సాబాలు మైగొన్న యా
యలరుంబోడుల యెప్పునై తగుఁ బురిన్ హర్మ్యేశ్వరశ్రేణికిన్.

208


క.

ప్రాకారమగుట నున్నతిఁ
గైకొని సాలంబుగానఁ గడుకొమ్మలచే
జోకై యట కోట తగున్
పాకాఠిశిలావిలాస భాసురమగుచున్.

205


మ.

ఘనగంభీరతరాంబుసంగతి పొసంగంబొల్చుఖేయంబు నం
బునిధిం [6]బోలుననంగరాదె యచటన్ మోదంబు సంధిల్లఁగా

  1. వేద. తా.
  2. శోన్నత. తా.
  3. సంఘంబుల్ నిరీక్షింప. తా. సంఘంబుల్ నిరీక్షించి పెన్వెఱ. పూ. ము.
  4. బొమ్మ. తా.
  5. ననుప. తా.
  6. బోల్చు తా. పూ.ము. తా.