పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

83


మార్తాండమండలప్రభాజాలంబును ద్రవిడవిలాసినీకుచ లికుచద్వయ
న్యస్త నిస్తులనవహరిద్రాలేపనవిభాజనిత చంచత్కాంచన కంచుక
భ్రమాలవాలంబును సంతతాంచితారామసీమాంత రోద్దామ మాధవీ
మాలతీ మల్లికా మతల్లికా కుసుమ విసర కేసరోజ్జ్వలపార్శ్వ
తలోత్తాలంబును నగు స్వామిపుష్కరిణి కూలంబున నిలిచి సౌగంధిక
బంధుర సుగంధగంధిలంబులగు తత్కబంధంబులఁ గృతావగాహనులై
కాల్యకరణీయంబులు నిర్వర్తించి కాంచనశైలశంకాకారి ప్రాకా
రంబగు తత్ప్రాకారంబుఁ జేరంజని.

173


సీ.

భేరీ మృదంగ గంభీర రావాటోప
వారిత వారిధివారి రవము
అవిరళధూప ధూమాంబుదాలోక
తాండవితాహిభుఙ్మండలంబు
కేతు పటాంచల కింకిణీ కలకలా
కులిత భాను శతాంగ ఘోటకంబు
ప్రాకారమణివిభాపటల సిందూరిత
కకుబంత దంతీంద్ర గండతలము
ననుదిన నటన్నటీపాద హంసక [1]స్వ
నాకులిత బలి[2]కాంక్షా సమాగతాంబు
జాత సంభవ హంసకంబై తనర్చు
నిందిరాజాని కాంచన మందిరంబు.

174


వ.

ప్రవేశించి తత్పురోభాగంబున.

175


సీ.

పొడుపుగుబ్బలి మీదఁ బొడుచు భానుని లీలఁ
గల కిరీటము తలఁగలుగు వాని
నఱచందురుని వెన్నుఁజఱచు నెన్నుదిటిపై
ముత్యాల తిరుమణి మురువు వాని
మొసలివా మించుల మిసమిసల్ దీపించు
నొసపరి కుండలయుగము వాని
సెలవుల తుది కెక్కు చిఱునవ్వు డాల్ టెక్కు

  1. త్వ. తా.
  2. కాంక్ష పూ. ము.