పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ఘటికాచలమాహాత్మ్యము


తళుకు లేఁజెక్కుల కులుకు వాని
కలువ తామర కొలముల వలవఁ జేయు
చూపులను చలి వేడియు జూపువాని
విమల లావణ్యజలనిధి వేల బొడము
పగడ మననొప్పు వాతెర సొగసు వాని.

176


సీ.

కరశంఖమునకు నేక[1]గ్రీవమనుఠేవ
గల గ్రీవ[2]చెలువునఁ జెలఁగువాని
తనువెత్తు కీర్తి ప్రతాపంబులన మించు
కరగత శంఖచక్రములవాని
నాకల్పఫలమిచ్చు నా కల్పశాఖల
దాయాదులౌ కేలుదోయివాని
నలకనిర్జితభృంగయౌ నలమేల్మంగ
కిరవైన పచ్చని యురము వాని
కోరి యిరుదుగ మొగముల కుఱ్ఱ గన్న
యమ్మ [3]నాఁజను పొక్కిటి తమ్మివాని
ఘోర దానవ విపిన కుఠారమైన
బలు కటారంబు కటి తటి గలుగువాని.

177


సీ.

బంగారువ్రాత చేరంగుల రంగారు
పట్టు దుప్పటి కటిఁ గట్టు వాని
పద్మ పద్మప్రభాస్పద పాద వేదమం
జీరమ్ములను విలసిల్లు వాని
నతుల చిరత్నరత్నాంశుజాలముల మిం
చుల[4]మించు భూషల నలరు వాని
శృంగార రసరుచిశ్రీలకు నెలవైన
మెఱుఁగు చామనచాయ మేనివాని
సర్వ గీర్వాణ సముదయ సార్వభౌమ
[5]బిరుదకలనాతివిఖ్యాతి వెలయువాని

  1. గ్రీవమును. తా.
  2. చెలువుల. తా.
  3. దానకు. తా.
  4. మించుల. తా.
  5. భిరుదుగల నాతి. తా.