పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఘటికాచలమాహాత్మ్యము


విన్నపమొనర్పఁగా నీతి వేగరులకు
చిత్త మిఁక దేవరపరాకు సేయఁదగదు.

73


చ.

అనవుడు గుండె ఝల్లనఁగ నాదివిజాధిపుఁ డొక్కభృత్యునిం
గనుఁగొని రంభ నూరుజితకాంచనరంభను తోడిదెమ్ము పొ
మ్మనఁ జని యంతయుం దెలుప నాచెలి వార్తలు వేడ వాఁడు నే
విన మఱి [1]యేగుదేరి యొకవేగరి బాగఱి వేగకృద్గతిన్.

74


గీ.

వచ్చి విచ్చలవిడి కొల్వువారినెల్లఁ
దలఁడనుచుఁజొచ్చి దొర చెవిదండఁ జేరి
పలికె నేమేమొ నా కేమి తెలియదబల
పిలువుమన వచ్చినాడ రావలయు ననుడు.

75


సీ.

చల్లని పన్నీట జలకంబు [2]లారిచి
చెంగావిపావడజిగిబెడంగు
వెలికిఁ గ్రమ్మగ జిల్గు వెలిపట్టు కటిఁగట్టి
కప్పురమ్మున తిలకమ్ముదిద్ది
కమ్మని తావులు కడలంట కొప్పున
మందారకుసుమదామములు చెరివి
తనువు పంకజగంధమును [3]బూతజవ్వాది
తావియునొండొంటిఁ ద్రస్తరింప
రెప్పలకు కొంత జిలిబిలిరేక [4]గూర్చి
వెన్నెలల పంటయౌహారతతి గబ్బి
గుబ్బచన్నులపైఁ జెన్ను గులకరింప
[5]తొలకరి మెఱుంగు నామేను తులకరింప.

76


క.

కలువల చెలి మేనల్లుం
డల [6]పింతయు లేక వీఁక నార్చినరీతిన్

  1. యేమిదేయొక. తా. యేమిదేవి యొక. పూ. ము.
  2. దీరిచి. పూ. ము. తా.
  3. బూయ. తా. బూయు. పూ. ము.
  4. గూర్ప. పూ.ము. తా.
  5. ఈ పాదము తాళపత్రప్రతిలో లేదు.
  6. వింతయు. తా.