పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

57


కళుకు బంగారు ఱేకుల కులుకు మీఱి
బెళుకు తెరమానికపు జగతులను సోయ
గంబు నింబగు వైజయంతంబులోన
నిండుకొలువయి యుండి నాఖండలుండు.

69


ఉ.

చారుఁడొకండు ఘర్మకణజాలము ఫాలము మోచి పాదముల్
మేరగ ధారగాఁగురియ మేనువడం[1]కఁ గడంక నిల్పు దౌ
వారికకోటి దాటి కయివారపువారి వదల్చి కిన్నరీ
చారణగానము ల్గలఁచి సమ్ముఖమంది భయమ్మునొందుచున్.

70


ఉ.

చేరఁగవచ్చి మ్రొక్కి సురశేఖర! దివ్యకిరీటకోటిమం
దారనగప్రసూన రసధౌతపదాంబుజ! దానవచ్ఛిదో
దారశతార! మీరనుప ధారుణికింజని యొక్కవింత నే
నారసివచ్చినాఁడ భయమయ్యెడుఁ దెల్పగ సామిసన్నిధిన్.

71


సీ.

ఈవఱకును సామియిచ్చలోఁ జరియించు
మన్ననపురుషులు మాన్యచరితు
లల భరద్వాజ కళ్యప గౌత మాత్రి కౌ
శిక జమదగ్ని వసిష్ఠమునులు
పరమ పతివ్రతాభరణమైన యరుంధ
తీరమణియు నతితీవ్రనియమ
పఠతమై శతకూటపర్వతేంద్రమున న
త్యుగ్రతపస్థితినున్నవారు
నాకమో యటు గాకున్న నలినభవుని
లోకమో కాక స్మరవైరిలోకమో ము
కుందలోకమో వారల ఘోరతపము
పాకమునకు ఫలంబు త్రిలోకనాథ!

72


గీ.

మఱుఁగువెట్టక వెఱవక మఱుపులేక
కన్నకార్యము మఱి విన్నకార్య మెల్ల

  1. కడకంట. తా.