పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

ఘటికాచలమాహాత్మ్యము


క.

ఇల నెమ్ముల నాడింపఁగఁ
దొలకరి నట్టువ కొలంపుదొర యెత్తిన చే
నలరెడుపుత్తడిబెత్తనఁ
దళుక్కుమనెఁ దీగమెఱుపు ధనదాప్తు దెసన్.

43


గీ.

సమయవీరుఁడు వేసవి శత్రు దోల
నించు [1]సింహనాదమనఁగఁ జంచలించు
పాంథతతి గుండె [2]ఫక్కున బగుల మొగిలు
ఘుమఘును నురిమె దిక్కులు ఘూర్ణిలంగ.

44


గీ.

తగిలి తనవారి నెదురు చాతకగణంబు
రాలఁగొనిరువ్వె మేఘుఁ [3]డౌరా యనంగ
స్థిర ననంతాబ్జగేహపూజించు విరుల
కరణి జలజల మని వడగండ్లు రాలె.

45


క.

ఉడుపథ మను మఱ్ఱిం గడు
నెడ[4]విడి వడ డిగిన యూడ లివియన ధారల్
బెడిదముగ నంబుదంబులు
జడిగొని వర్షంబు గురిసె జడధులు పొంగన్.

46


సీ.

అత్తఱిఁ గౌండిన్యుఁ డనుమౌని [5]యమలవి
జ్ఞానమానసుఁడు సచ్ఛాత్రుఁ డగుచు
తీర్థసేవాకాంక్షఁ దిరుగుచు ఘనదైత్య
చక్రమౌ నాహరిచక్రమునకు
జనుదేర గోవిందశర్మ యెఱింగి యె
దుర్కొని యింటికిఁ దోడి తెచ్చి
పుత్రులు దానును బొలఁతియు నర్ఘ్యపా
ద్యమ్ము లొసంగి సాష్టాంగ మెరఁగి

  1. సింహదలోయన. తా. సింహములోయన పూ.ము.
  2. పక్కల బరల తా.
  3. డా. తా.
  4. విడువడ. పూ. ము. తా.
  5. యనమ. తా.