పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

49


క.

వారిరు[1]వురు నిటు వలపుల
కోరిక లీరికలు గొనగఁ గుసుమశరకర
[2]స్ఫారధనుర్ముక్తశరా
సారవిమూర్ఛితమనోంబుజాతద్వయు[3]లై.

37


క.

విద్దెయుఁ గులమును శీలము
పెద్దఱికము గట్టి[4]పెట్టె విప్రుఁడు గడుసై
పెద్దల[5]పను పిలు వాటిక
సుద్దులు జల మెత్తుటయును సుదతియు మఱచెన్.

38


క.

ఇత్తెఱఁగునఁ జెలిహత్తుక
చిత్తజరణకేళి [6]బాళిఁజిక్కి ధరాదే
వోత్తముఁడు క్రీడసల్పఁగఁ
దత్తనుమధ్యకును నేను దనయుఁ డనగుచున్.

39


క.

బాలోచితకృత్యంబుల
మేలిమి జనయిత్రి మైత్రిమీఱఁగఁ బెనుపన్
నాలుగునైదుశరత్తుల
బాలుఁడనై గోముమీఱ బ్రబలుచునుండన్.

40


క.

ఇనరుచులవేడి వడదా
కిన ఘన[7]పదలక్ష్మిమేన కలిగింపఁగ వా
డిన వనజాతదళమ్ముల
యనఁ దుములంబగుచుఁ బర్వె నంభోదంబుల్.

41


గీ.

ఎలమి నిన్నాళ్ళు సైచితి నింకనైనఁ
బుచ్చుకొన్నట్టి యప్పిచ్చి పొమ్మటంచు
హరిహయుఁడు భాను జుట్టిన గురి యనంగ
భీషణాటోపతను పరివేష మడరె.

42
  1. వుర కిటు. పూ. ము.
  2. సార. తా.
  3. డై. పూ. ము. తా.
  4. పెట్టి. పూ. ము. తా.
  5. పెనుపలవాటగు..... .... బెల మెత్తు... .నిమఱగెన్. పూ. ము.
  6. జాల పూ. ము.
  7. సద. తా. పదలక్ష్మి మేనఁగలింపగ. పూ. ము.