పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


గీ.

కరము లచ్ఛోదకమ్ములఁగడిగి వార్చి
తులసిరేకులు సేవించి కళుకుపచ్చ
డాలుతిన్నె వసించి బాగాలు ధవళ
నాగవల్లిదళంబు లందఱకు నొసఁగి.

18


ఉ.

ఆ యతిథివ్రజం బనిచి యంచితభక్తినియుక్తి బాలరా
మాయణమున్ బఠించి తెలనాకులతోఁ గపురంపుబాగముల్
జాయ యొసంగఁగా ముఖవిలాస మొనర్చి రమేశు[1]సత్కథల్
పాయకవించు నా ఘనుడు ప్రత్యహ మిట్లు చరించు ధన్యుఁడై.

19


క.

తరళ యనంగ నొకానొక
తరళవిలోచన తదార్యదంపతిసేవా
తరలమతిఁ దద్గృహమ్మున
దరలక వర్తించు నెంచఁదగువర్తనలన్.

20


క.

[2]వఱువాత లేచి యాబుధ
వరు వరవుడుఁ [3]బోల్పఁదగినవా రెవరన శ్రీ
వరుఁగీర్తింపుచు వాకిలి
వరుసన్ ముంగిళ్ళు దుడిచి వారనిభక్తిన్.

21


క.

గోమయగోముఖకలన
శ్రీమెఱయఁగఁ బంచవర్ణరీతుల మ్రుగ్గుల్
ప్రేమ నలుగడల నించున్
వేమరు తరుణీజనంబు విస్మయ మందన్.

22


క.

వాఁకిటికి వచ్చు సతులం
గైకొని వినయావలోకగతి నలరించున్
శ్రీకార్య[4]పరులకు నమో
వాకం బొనరించు వికచవదనాంబుజయై.

23


శా.

అయ్యమ్మంచుఁ దదార్యదంపతుల నెయ్యంబొప్ప సేవింపుచున్
వ్రయ్యల్గా సకలాఘముల్ హరివినిర్మాల్యంబు ధమ్మిల్లసా

  1. తత్కథల్. తా.
  2. దరు. తా.
  3. జాల. పూ. ము.
  4. వరులకు. తా.