పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ఘటికాచలమాహాత్మ్యము


హాయ్యంబొంద ముకుందదాసజనశేషాన్నంబు [1]క్షుత్కీలసా
న్నాయ్యంబై యలరం జరించుఁ జెలి యానందంబున న్నిచ్చలున్.

24


క.

ఈరీతి నామహాత్ము న
గారమ్మున సంచరించుకారణమున నా
నారీమణికిఁ బురాకృత
ఘోరాఘుములూడె మిగులఁగూడెన్ శుభముల్.

25


శా.

ఆచెంత న్వసియించు భూసురుఁడొకం డౌదార్యకర్ణుండు రే
ఖాచేతోభవమూర్తి కాంతిజితరాకాకోకవిద్వేషి వి
ద్యాచాతుర్యఫణీశదేశికుడు ప్రేమాయత్తచిత్తుండు త్ర
య్యాచారాచరణప్రచారి హరిశర్మాఖ్యుం డుదారోన్నతిన్.

26


సీ.

కలికిప్రాయంపురాచిలుకబాబాలూను
[2]మీనుటెక్కియపు తెమ్మెరలతేరు
నరవిరి విరిమొగ్గ శరముల కిరవగు
చిగురల్లికల తెల్ల చెఱకువిల్లు
తేనియబాష్పంబునూనియ జిగిజిమ్ము
తమ్మిపూరెమ్మ దోదుమ్మికత్తి
[3]చల్వ జెల్వగు నల్లకల్వలఱేకుల
చికిలిసంతనవింతచిలుకుజోడు
[4]లేకయుండిననేమి నాళీకలోచ
[5]నాజనానూనమానద నవమనోజుఁ
డనఁగ కనుపట్టె భూ[6]దేవతాత్మజుండు
వలపు చెలువొందు నిండుజవ్వనమునందు.

27


సీ.

నునుపుగా దువ్వి వైచిన శిఖాబంధంబు
ఘనలీల నవటుభాగమున వ్రేల
[7]మేలిమి నిద్దంపు జాళువాపోగులు
చికిలి లేఁజెక్కులఁ జిగిదొలంగ

  1. క్షుత్కీలికాన్యాయంబై. పూ. ము.
  2. మీరు
  3. చెల్వ. తా.
  4. లై యుండిన. తా.
  5. నాజనాసూననాజనాసూన .... జ. తా.
  6. దివిజాత్మ. తా.
  7. యీలాగుజాళువాపొంగుళ్లు. తా.