పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఘటికాచలమాహాత్మ్యము


క.

ధాత్రీతనయారాఘవ
గోత్రావరలిఖితచిత్రకూటంబై వై
చిత్రిఁదగు చిత్రకూటము
పాత్రతరంబైన పంచవటియును భక్తిన్.

72


క.

కనుఁగొనివచ్చితినన నతఁ
డనఘా! యీ నూటయెనిమిదగు తిరుపతులన్
దనరు సుచరిత్రములు పా
వన పూజ్యస్థల కథాప్రభావము కరుణన్.

73


క.

ప్రకటింపుచు నడుమ నొకిం
చుక ఘటికాచలము మహిమ సూచించితి రు
త్సుకతన్ హరి యాశైలము
నకు వేంచేయుటకు కారణం బెయ్యదియో?

74


క.

వేడుక యయ్యెడు తద్గిరి
చూడామణికథ వినంగ సుర[1]ముని! యబ్జ
క్రోడప్రోద్భవనందన!
యీడితమృదువచనరచన నెఱిఁగింపఁగదే.

75


మ.

అనుడున్ ధన్యుఁడనైతి నియ్యెడ మహాత్మా! యాత్మభూనేతకై
నను వాగ్దేవతకైన వేదములకైనం బన్నగస్వామికై
నను వాచస్పతికైన నా కుధరమున్ వర్ణింపశక్యంబుగా
దనినన్ మాటలు వేయు నేమిటికి శక్యంబౌనె మాబోంట్లకున్.

76


ఆ.

సనక జనక జనకుఁ డనురాగమున రమ
కానతీయ నేతదచలచరిత్ర
మేను వింటి [2]నొప్ప నదిమహాఘచ్ఛటా
దారణంబు ముక్తికారణంబు.

77


సీ.

సంచితాద్యఘ సమిత్సమితికిఁ గార్చిచ్చు
హరివైభవస్వర్ణ మొదయ మచ్చు

  1. వర. తా.
  2. గొప్పనిది. తా. గొప్పమిది. పూ. ము.