| తే. |
ఆతఁ డెంతటివాఁడు? ప్రేమాభిరామ
మనఁగ నెంతటియది? దాని ననుసరించి
వీథి యనురూపకము మది వెఱపు లేక
తిప్పవిభు వల్లభుం డెట్లు తెనుఁగుఁ జేసె?
| 34
|
| ఉ. |
నన్నయభట్టతిక్కకవినాయకు లన్న, హుళిక్కిభాస్కరుం
డన్నను, జిమ్మపూఁడి యమరాధిపుఁ డన్నను, సత్కవీశ్వరుల్
నెన్నుదుటం గరాంజలులు నింతురు జే యని, రావిపాటి తి
ప్పన్నయు నంతవాఁడ, తగునా యిటు దోసపుమాట లాడఁగన్?
| 36
|
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
| ఆ. |
జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాఁడుబిడ్డ మేలుగాదె?
| 37
|
పాత్రప్రవేశసూచనము
| చ. |
“గతిరసికుండ! షట్చరణ! గానకళాకమనీయ! యో మధు
వ్రత! వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి? వటవీప్రదేశమునఁ [1]జెట్టులఁ జేమలఁ నేమి గల్గు నన్
రతి నిటు సంచరించెదవు? ప్రాఁబడిపోయెనె నీవివేకమున్?
| 39
|
| ఆ. |
చేర వచ్చి వచ్చి దూరంబుగాఁ బోదు,
డాయవత్తు దవ్వు పోయి పోయి,
మాట లింక నేల? మా పాలిటికి నీవు
మాయలేడి వైతి మంచిరాజ.”
| 40
|
- ↑ జెట్టులు చేమలు నేమి గల్గినన్ బతిచెడి (మూ.ప్ర.)