Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లహరీభ్రమఘుమఘుమములు
వహిఁ దిప్పయ వల్లభన్న వాగ్వైభవముల్‌.

23


క.

హాటకగర్భవధూటీ
వీటీకర్పూరశకలవిసృమరసౌర
భ్యాటోపచాటుకవితా
పాటవ మరు [1]దవని వల్లభన్నకు నమరున్‌.

24


క.

హల్లీసక నట[2]నోద్భట
పల్లవ హరికృష్ణ కంఠ వనమాల్య మిళ
ద్గల్లత్సురభులు, తిప్పయ
వల్లభ రాజప్రధాన వాగ్వైభవముల్‌.

25


క.

అమృతరసమథనసంభవ
ఘుమఘుమితపయఃపయోధికోలాహలమున్‌
భ్రమియించుఁ, దిప్ప సచివో
త్తము వల్లభవిభుని చాటుధారాఫణితుల్‌.

26


క.

భిల్లావతార మధుభి
ద్భల్ల భుజాస్ఫాల్యమాన పటుచాపజ్యా
వల్లీమతల్లి చెల్లెలు,
వల్లభరాయప్రధాని వాగ్వైభవముల్‌.

27


క.

నెల్లూరి తూముకాలువ
హల్లకముల కమ్మఁ దావి నపలాపించున్‌
సల్లలితలీలఁ, దిప్పయ
వల్లభరాయ ప్రధాన వాగ్డంబరముల్‌.

28


క.

ఉపమించెద ధారాధర
తపనజ రేరాజ రాజ ధారానగరా

  1. ధవణి (మూ.ప్ర.); ఢవణి (మా)
  2. నోద్భవ వల్లభ (మూ.ప్ర.)