| వ. |
పాడిపంతంబు లెఱిఁగిన పెద్దవు నీవు. మాభాగ్యకృతంబున
విచ్చేసితివి. అజ్ఞానకృతంబునకుం బ్రాయశ్చిత్తంబు విధింపు
మని మఱియును,
| 250
|
| శా. |
హాలాపానమదాతిరేకమునఁ బర్యంకంబుపై నొంటి ని
ద్రాలస్యంబున నుంట దక్క, మరి యేయన్యాయమున్ జేయ నే
నేలా పాపము గల్గె? నీ భయము వో నే ముట్టెదన్ శుద్ధికై
వాలాయంబును మీనకేతనుని దివ్యశ్రీపదాంభోజముల్.
| 251
|
మంచనశర్మ బోధించిన విటధర్మసూక్ష్మము
| వ. |
అనిన, గోవిందుండు మీరు విటజనధర్మసూక్ష్మం బెఱుంగరు.
ఇది యన్యాయంబు గాదు. వేశ్యాజనంబునకు వావివరుస యెక్క
డిది? తొల్లి నముచిసూదనునకు ననుపులంజెయై యూర్వశి
యతని కొడుకుఁ గవ్వడిం గామింపదే? రావణుండు నలకూబరుని
రంభోరు నంభోరుహాక్షి రంభం గోడలిని సంభోగింపక సాగ
నిచ్చెనే? వారకాంతను దల్లి, దాసి, యప్ప, చెలియలు, కూఁతురు,
దాది యని [1]కేళికాగేహంబునం బరిహరించుట విటధర్మంబు
గాదు.
| 252
|
| ఆ. |
జాణతనము గల్గి, [2]సవరతనము గల్గి,
తెలివి గల్గి, మోరతీరు గల్గి,
చే యలంతి తనకుఁ జే కూడినప్పుడు,
వావి వలదు లంజెవారియింట.
| 253
|
| వ. |
అని పలికి సౌముఖ్యంబు సంపాదించి,
| 254
|
| చ. |
వదినెయు, లంజెయున్, విటుడు, వైరము లాత్మల నుజ్జగింపుఁ డ
భ్యుదయపరంపరా[3]వివిధభోగము లందుఁడు, మేము వోయివ
| 255
|
- ↑ గణికా (మూ.ప్ర.)
- ↑ సరసతయును (మూ.ప్ర.)
- ↑ విభవ (మా)