| |
యా విశ్వస్థయుపస్థచాయ నవలక్షాధీశఫాలస్థలీ
సౌవర్ణస్థిరపట్టబంధసుషమాసౌభాగ్యలక్ష్మిన్ గనున్.
| 169
|
| ఉ. |
కోయిల పంచమస్వరము క్రోల్చినభంగిని [1]గంఠ మెత్తి, రా
మాయణ మాఱుకాండములు నచ్యుతజాగరవేళఁ బాడె నా
రాయవితంతురత్న మనురాగముతోడ, “నమశ్శివాయ శాం
తాయ సమస్తదోషహరణాయ” సమానమె దాని కెవ్వరున్?
| 170
|
| ఉ. |
సంకృతపూతిమాషకులసాగరశారదపూర్ణిమాకురం
గాంకుఁడు మంచి, లక్ష్మణుగృహంబున నెచ్చెలికాఁడుఁ దానునుం
జంకలబంటిగా మెసవి, చక్కనివేడుకకత్తెఁ జూచి, తా
రింకొకమారు వత్తమని యేఁగిరి కార్యభరంబుపెంపునన్.
| 171
|
పుష్పలావిక – గేఁదగిపూవు కానుక
| సీ. |
పాంథసీమంతినీప్రాణమత్స్యములకు
గాలాము లగుకంటకములతోడ,
గరుడపచ్చలచాయఁ బరిహసింపఁగ జాలు
దళమైన బాహ్యపత్రములతోడ,
జీర్ణకీకసకణశ్రేణిఁ జిడ్డలు చేసి
యవియఁ దోమినయట్టి యన్నుతోడఁ,
బదియాఱువన్నియ బంగారు సరివచ్చు
సంవర్తికాపలాశములతోడ,
|
|
| తే. |
శివుని చిచ్చఱకంట వెచ్చిన యనంగు
బూది కెన యైన కమ్మఁబుప్పొళ్ళతోడఁ
|
|
- ↑ విద్ది చూచి (మూ.ప్ర.)