Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మందవేగంబుతోఁ గ్రొత్తమలఁకవాళ్ళ
కిఱ్ఱుచెప్పులు మొరయ, నుంకించి నడుచు
కరణబ్రాహ్మణవిటముఖ్యుఁ గదియవచ్చి,
పూతిమాషాన్వయుం డగుభూసురుండు.

162


వ.

పూఁటవంటకంబులవృత్తాంతం బడిగిన నతండు,

163

ఆహారవిహారముల యభిరుచులు

క.

ఆహారవిహారములకొ?
యాహారంబునకునో, విహారంబునకో
బేహారము? మీ కీసం
దేహారంభంబు మాకు దెలియఁగ వలయున్‌.

164


వ.

ఆహారంబున కంటేని;

165


ఉ.

కప్పురభోగివంటకము, కమ్మనిగోధుమపిండివంటయున్‌,
గుప్పెఁడు పంచదారయును, గ్రొత్తగఁ గాఁచిన యాలనే, పెస
ర్పప్పును, గొమ్ము నల్లనఁటిపండ్లును, నాలుగు నైదు నంజులున్‌,
లప్పలతోడఁ గ్రొంబెరుగు లక్ష్మణ[1]వజ్ఝలయింట రూకకున్‌.

166


వ.

విహారంబున కంటేని?

167


క.

అఱుగౌను, గుబ్బచన్నులు
మెఱుఁగుంగన్నులును గలుగు మెచ్చులనవలా
కుఱుబోడముండరత్నము
[2]బఱివోవఁగ విడిచినట్టి బ్రహ్మకు జే జే.

168


శా.

పూవుంబోఁడులు లేరె విప్రవిధవల్‌ భూమండలిన్‌? దాని రే
ఖావైదగ్ధ్యవిలాసవిభ్రమకళాగర్వంబు ల ట్లుండనీ,

  1. యొజ్జల (మూ.ప్ర.)
  2. బఱిపోతుగఁ జేసినట్టి (మూ.ప్ర.)