Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పలనాటి వీరుల చరిత్ర

ఆ.

కులము దైవతంబు గురిజాల గంగాంబ,
కలని పోతులయ్య చెలిమికాఁడు,
పిరికికండ లేని యఱువది యేగురు
పల్లెనాటి వీరబాంధవులకు.

118


గీ.

ఆరువల్లి [1]నాయురాలి దుర్మంత్రంబు,
కోడిపోరు, చాపకూటికుడుపు,
ప్రథమకారణములు పల్నాటి యేకాంగ
వీరపురుషసంప్రహారమునకు.

119


ఉ.

పచ్చని పిండిగందమును, బాలము సేసయు, నెఱ్ఱపూవులన్‌
గ్రుచ్చిన కంఠమాల్యములు, [2]గొప్పఁగ నల్లిన వేణిబంధముల్‌,
కుచ్చుల వీరసంబెటయుఁ, గ్రొత్తమణుంగఁగు కాసెపుట్టము
న్రచ్చల కెక్కినట్టి రవణంబులు, వీరకుమారకోటికిన్‌.

120


క.

నల్లంగొండయు, నాగరి
కల్లును ధరణీస్థలిం బ్రగల్భస్థలముల్‌;
పల్లేఱు, నాగులేఱును
బల్లె క్ష్మాకాంత యెల్ల ప్రారంభమ్ముల్‌.

121


సీ.

“ఇచ్చోట భుజియించి రేకకార్యస్థులై
                        సామంతనృపతులు చాపకూడు,
ఇచ్చోటఁ జింతించె నిచ్చ నుపాయంబు
                        నళినాక్షి యార్వెల్లి నాయురాలు,
నిజ మను శుద్ధికై నిప్పులయేటిలో
                        నోలాడె నిచ్చోటఁ బీలసాని,
యిచ్చోటఁ బోరిరి యిల పణంబుగ గొల్ల
                        సవతితల్లులబిడ్డ లవనిపతులు,

  1. నాయినారి (మూ.ప్ర.)
  2. కొప్పుగ