ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102
కువలయాశ్వచరిత్రము
- కమ్మబంగరు సిగ్గొ కలిగినపలుడాలొ చెలువ చూతమటంచుఁ జెక్కు నొక్కి
- ముక్కఱ ముత్తి యంపు మెఱుంగొ లేనవ్వొ ముదిత చూతమటంచు మోవి పుడికి
- కుంకుము జిగియొ నెక్కొను గుంపుదండయో కొమ్మ చూతమటంచు గుబ్బలంటి
- తెలివియై మీరు నూగారుదీప్తియొక్కొ, మేలిమొలనూలినీలమో మెఱుఁగుఁబోఁడి
- చూతమని పోకముడి విప్పి సుదతిఁ గరఁచి, యించువిలుకానిసామ్రాజ్య మేలి విభుఁడు.109
క. అంతట వేఁగిన ధరణీ, కాంతుఁడు సంధ్యాదికములు గావించి ప్రజన్
- సంతసమునఁ బాలింపుచు, నింతింగవఁ గూడి సౌఖ్య మెనయుచు నుండెన్.110
వ. మునీంద్రా! మార్తాండదత్తంబగు కువలయాశ్వంబు చలనం జయం బందుటం జేసి ఋ
- తధ్వజుండు కువలయాశ్వుం డనం బరఁగె ననిన సంతోషధుర్యుండై జైమినిముని యవ్వి
- హంగమములం బూజించి సుఖంబుండె నంత.111
క. ఈకువలయాశ్వచరితముఁ గైకొని చదివినను వినినఁ గారుణ్యసుధా
- శ్రీకరుడు కృష్ణుఁ డొసగున్, శ్రీకరముగఁ బుత్రపౌత్రచిరవిభవంబుల్.112
శా. పూర్వగ్రస్తవినిర్మలత్వబహిరుద్భుద్ధారకీర్త్యంకురా
- ఖర్వచ్చాయ కరస్థఖడ్గ, సబలాకారేఖ మేఘోల్లస
- త్సర్వాశౌఘతమిస్రఘస్మరమహాసౌదామినీసూతికా
- గుర్వర్థార్పణహృష్టయాచకజనా కోదండలీలార్జునా.113
క. ధాటీకరటి ఘటారథ, కోటీక్షిప్తారికుంభికుంభతటమణీ
- కోటీవైవాహికము, క్తాటీకనవిజయమాశ్రితకరాంబురుహా.114
మాలిని. పరిధృఢభుజతేజా భానుమద్బింబభానూ
- ద్భవహరిదబలాంగ స్థాయిఘర్మోదబిందూ
- భవదనభిముఖాసి భ్రామ్యధైభాగ్రహస్తా
- ప్రవివృతబలతేజా ప్రౌఢకీర్తిప్రకాశా.115
గద్య
ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమన్వయా
- భరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద సంచలన్మా
- నసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర రూపరేఖాజి
- త చైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధాయక చిననారాయణ
- నాయకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రంబను మహాప్రబంధమునందు సర్వంబు
- ను బంచమాశ్వాసము.
సమాప్తము.