ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
101
- కాంతు లందఱుఁ గట్టువర్గములగములు, వరుసఁ జదివించి రవ్వధూవరుల కెలమి.100
వ. ఇవ్విధంబున వివాహమహోత్సవంబు ప్రవర్తిల్లినం దినచతుష్టయానంతరంబునం బ్ర
- తిప్రయాణోన్ముఖుండైన కువలయాశ్వునకు నశ్వతరుం డనేకవస్తువు లరణం బొసంగి
- మదాలసావిలాసవతికిఁ బుద్ధులు గఱపి కుమారద్వయంబును దారాకుంతలాదివేదం
- డగమనలను వెంటం గూర్చి యనిపిన రథారూఢులై వారు గోమతీనదీముఖంబునఁ
- బాతాళలోకంబు నిర్గమించి శోభనాలంకారాకారంబగు నయోధ్యాపురంబుం బ్ర
- వేశించి గృహప్రవేశంబు గావించియున్న మఱునాఁడు దినాంతసమయంబున.101
ఉ. ముంగల నుబ్బచప్పరము ముత్తెపుముగ్గులుఁ బూలమేలుక
- ట్లుం గొదలేనిచిత్తరువులున్ బురుసాపనితోడిమంచముం
- జెంగట బీరువాగముల చెల్వము గల్గిన కేళిగేహసీ
- మంగమనీయవేషమున మానవనాయకుఁ డుండు నయ్యెడన్.102
గీ. తారాకుండల మొదలైన తలిరుఁబోఁడు, లమ్మదాలసఁ జూచి రావమ్మ నీకు
- వరశుభప్రాప్తి చేకూరవలయు ననుచు, ననుచు వేడుకఁ దమలోన నవ్వుకొనుచు.103
చ. జలకముఁ దీర్చి పావడ కళల్ వడిమార్ముడి వైచి జాలువా
- వలిపెముఁ గట్టి గుబ్బల జవాది యలంది తురాయిరీతిగా
- నలరులు గొప్పునం దుఱిమి హారము లుంచి పిసాలికస్తురిం
- దిలకము ముద్దుగా నుదుట దిద్ది గుముల్ గొని వార లత్తఱిన్.104
సీ. అన్నియుఁ దెలిసిన వన్నెలాఁడికి నీకు దెలిపెడి దేమమ్మ కలువకంటి
- వినవమ్మ మగవాని మనసు చూడఁగఁ గంచుఁబదనువంటిది సుమీ పద్మగంధి
- యిన్నాళ్ళవలెఁ దోడియింతులతోడి యాటలు గావుగద యిదితలిరుఁబోఁడి
- యిదిపతి మన మెట్టు లెసయించెదో నేఁడు నీనేర్పు చూతము నీరజాక్షి
- యిక్కడనె యింత సిగ్గైన హృదయనాథు, నెట్లు గరఁగింపనేర్చెదే యిందువదన
- భావ మెఱిఁగినజాణవుగా వెసమయ, మెఱిఁగి తఱితీపు సేయుమీ యిగురుఁబోణి.105
గీ. అనుచుఁ దోతేఱ నప్పు డవ్వనజవదన, సిగ్గు వెనుకకుఁ దిగువ నెచ్చెలులఁ జుఱుకు
- మాట ముందఱి కీడ్వంగ మందగమన, మినుమడింపఁగఁ, జని కేళిగృహముఁ జేర.106
క. వనజాక్షులంద ఱొక్కొక, పనినెపమున జరుగ సరసఁ బగడపుఁ గంబం
- బును జాఁటుగాఁ గొనుచు ని, ల్చినతరుణిఁ జూచి విభుఁడు చిఱున వ్వెలయన్.107
గీ. లేచి నిలువుననే కౌఁగిలించుకొనుచు, విరులపాన్పున నుంచి పెన్నెఱులు దువ్వి
- కప్పురపుఁదావి గుప్పు బాగా లొసంగి, పొదలి తమకంబు రెట్టింపఁ బుజ్జగించి.108
సీ. అలరులానిన తుమ్మెదలొ నిక్కపున్రంగొ తరుణి చూత మటంచుఁ గురులు దువ్వి