| క. | మగణమ్ముఁ గలయ రగణము । వగవక కృతిమొదట నిలుపువానికి మరణం | |
యనియును బూర్ణబిందుప్రాసముక్రింద పద్యమును నుదాహరించెను. కవిసంజీవనిలో నెక్కటివళులక్రింద, స్మరతత్త్వసారము, కాశీశతకము, ముద్రారాక్షసము, భారతానుశాసనికము వీనిలోని పద్యము లుదాహరించి, నన్నెచోళునికుమారసంభవములోని "ఆయతమతినుత సప్తోపాయముల నెఱుంగవలయుఁ బ్రతిసామము భేదాయతి దానము దండము మాయోపేక్షేంద్రజాలమంత్రము లోలిన్" అనిమఱియు "పూని రహస్యం బాడెడుఁ వాని నీ దివానిరీక్ష్యవక్తవ్యం గాత్రే నైవచ నైవచ యనుమానితహితభాషణంబు మతి నిలుపదగున్" అని యిచ్చి యున్నాఁడు. వీనిలోఁ బైపద్యము 10వ యాశ్వాసమున నున్నది. క్రింది పద్యము దీనిలో లేదు. ఎచ్చటిదో యెఱుంగుటకును నలవి లేదు. పెద్దన లక్షణసారసంగ్రహములో 6వ ఆశ్వాసమునుండియు రత్నాకరకర్త 8వ యాశ్వాసమునుండియు బద్యము లుదాహరించియున్నారు. ఇందఱు చూచిన కృతి నేటి కెట్లు క్రొత్తనగును! అది యట్లుండ, నమరేశ్వరుని విక్రమసేనము, విన్నకోట పెద్దన ప్రద్యుమ్నచరిత, తిక్కనసోమయాజి విజయసేనము, కవి భల్లటుని విక్రమార్కచరిత్ర, పెమ్మన యనిరుద్ధచరిత్రమును ఎవ రెఱుంగుదురు. కవిలోకబ్రహ్మయను బిరుదుతో శతాధికకావ్యకర్త యగు పెద్దపాటి సోమనాధికవి నెవ్వ రెఱుంగుదురు? అతనియరుణాచలపురాణములోనుండి యొక్కపద్యము కవిసంజీవనిలోనుండి తీసి కూచిమంచి తిమ్మకవి యుదాహరించెను అతనికృతులలో శివజ్ఞానదీపిక, అరుణాచలపురాణము, కేదారఖండము ప్రౌఢములైనవి. మఱియును నన్నెచోళునిఁ బూర్వకవు లెఱుంగుదురా యనునంశమును సూచించుటకై పోలికపద్యములు దాపరించితివి. వానిలో ముఖ్యముగాఁ జక్కనకవియుం బింగళిసూరన, పూర్వకవిసూరన, తెనాలి రామలింగఁడు వీరు మొదలుగా భావచౌర్యమును జేసియున్నారు. పింగళిసూరన వీనిపద్యమును, రామలింగడు 823 పద్యమును జదివియే తమపద్యములు గూర్చిరి, జక్కన విషయమును జూడుఁడు.
| సీ. | దుగ్ధాంబునిధి నిట్లఁ దోఁచెనో యని శేషుఁ బాన్పుగా హరి నీటఁ బవ్వడింపఁ | కుమా ఆ. |
| సీ. | గంగాప్రవాహంబు కాఁబోలునని వశిష్ఠాదు లనుష్ఠాన మాచరింప | |