పుట:కుమారసంభవము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పీఠిక


క్షేమేంద్రుఁడను నొకానొక కశ్మీరమహాకవి కళావిలాస మని సంస్కృతమున నొకగ్రంథము వ్రాసియున్నాడు. తెనుఁగుబద్యముల నన్నియుఁ గూర్చి పోల్చిచూడగా నద్దాని కిది తెనుఁగు గాదనియు నిందుఁ గథాభాగముకూడఁ గలదనియు సంస్కృతమున దానిలోఁ గథాంశములు లేకుండుటయు జూడఁగా రెంటికిని నామమాత్రసాదృశ్యము గలదని తేలినది.

ఈ కుమారసంభవము కాళిదాసు కావ్యమునకుఁ దెనుఁగు గాదు. ఇందుఁ బేర్కొనఁబడిన సంస్కృతకవులలో నుద్భటుఁడనువాఁడు భావగర్భమునుగల కుమారసంభవ మను కృతిని రచించినట్లు కవి చెప్పుచున్నాఁడు. కాశ్మీరకవులలో జయాపీడ సంస్థానవిద్యాపతియగు నుద్భటుడొక్కఁడు శ్రీ - శ. 900 లో కావ్యాలంకారసారసంగ్రహమును రచించి దానిలోఁ దన కుమారసంభవ కావ్యములోనుండి శ్లోకము లుదాహరించుకొనెను. కావున నాయుద్భటుని కుమారసంభవమే నన్నెచోడుఁడు చూచెనని యేర్పడుచున్నది. ఆగ్రంథమిప్పుడు లభించునది కాదు. దానిలోని శ్లోకముల నుద్భటుఁడు తనయలంకారగ్రంథమునందును, ప్రతీహారేందు రా జను వ్యాఖ్యాతయు, కావ్యప్రకాశమునందు, సంకేతమను వ్యాఖ్యానమునందు మాణిక్యచంద్రుఁ డను కవియు, వల్లభదేవుఁడును, ఉదాహరించియున్నారు. అయ్యుదాహృత పద్యములనన్నియుఁ బోల్చిచూడఁగాఁ దెనుఁగు కుమారసంభవ ముద్భటుని కావ్యమునకు దెనుఁగు గాదని యేర్పడుచున్నది. మఱియు నాశ్లోకములను బట్టి చూడఁగా నుద్భటుఁడు శబ్దచిత్రములయందును నప్రస్తుతశ్లేషలయందును బ్రీతి గలవాఁడని తోచుచున్నది. కొన్నిశ్లోకముల నుదాహరించినఁ జదువువారలు రెండుకావ్యములలో భేదమును గుర్తెఱుంగుదు రని చూపుచున్నాను. “విరళాస్తాదృశా లోకే శీలసౌందర్యసంపదః నిశాః కియత్యోవర్షేపి యా స్విందుః పూర్ణమండలః” “సాగౌరీశిఖరంగత్వా దదర్శోమాం తప్కృఃకృశాం, రాహుపీత ప్రభస్యేందో ర్జయంతీః దూరతస్తనుం” “యాశైశరీ శ్రీస్తపసా మాసేనైకేన విశ్రుతా | తపసా తాం సుదీర్ఘేః దూరాద్విదధతీమధ్య”, “దంతప్రధాసుమనసంపాణిపల్లవశోభినీం తన్వీంవసగతాం లీలాజటాషట్చరణావళిం”, "స్వయంచపల్లవాతామ్రభాస్వత్కరవిరాజీనీ | ప్రభాతసంధ్యేవాస్వాప ఫలలుబ్ధేహితప్రదా, ఇందుకాంతముఖీ స్నిగ్ధమహానీలశిరోరుహా | ముక్తాశ్రీ స్త్రీ జగద్రత్నం పద్మరాగాంఘ్రిపల్లవా | అపారిజాతవార్తాపి నందనశ్రీర్భువిస్థితా అబిందు సుందరీ నిత్యం గలల్లావణ్యబిందుకా” ఇత్యాదులు చూడఁగా, “యాతాస్తేరససారసంగ్రహవిధిం నిష్పీడ్య నిష్పీడ్య యే | వాక్తత్వేక్షులతాం పురాకతిపయే తత్త్వస్పృఃశ్చక్రిరే | జాయంతేద్య యధాసుధంరు రవయస్తే తత్ర సంతన్వతే | యే౽నుప్రాసకఠోరచక్రయమకశ్లేషాద్యల్కోడ్చనుం” అను మంశుకునిశ్లోకము స్మరణకు వచ్చుచున్నది.