పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఘనగహనాంతరోద్గతతృణానీకంబు
                   ధేనువునందుఁ బాలైనయట్లు
వితతదుర్వర్ణరూపితలోహపిండంబు
                   రసమునఁ బసిడియై యొసఁగినట్లు
సాంద్రాభ్రవారివృషత్కదంబము శుక్తి
                   యందు ముక్తామణియైనయట్లు
భూరికుల్యాతకవారిరసాలమూ
                   లమునఁ బానకమై చెలంగినట్లు


తే.

కరిహయాందోళికారత్నకాంచనాదు
లగుచు నిజవక్త్రమున నిడ్డ హార్యమొప్పు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

91


సీ.

అన్నంబు నాలుక కరుచియై కన్పట్టు
                   నిలిచినచో నిల్వ నలవికాదు
మనుజేంద్రుతోనైన మాటాడ సైపదు
                   పనులయందేమియు మనసు లేదు
నడుచుచో నడుగులు తడబాటు గైకొనుఁ
                   దగఁ బందువులనైన నగవు రాదు
తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించుఁ
                   గలనైన నిద్దుర గలుగఁబోదు


తే.

శివశివా ధాత్రిఁ దా వలచిన వధూటిఁ
బాయు వెత వద్దు సుమ్మెట్టి పలువకైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

92