పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ప్రోది చేసినవానితోఁ బోరువాఁడు
చేరు దుర్గతి నిహపరదూరుఁడగుచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

42


సీ.

బహుపుత్రసంపత్తిఁ బ్రబలుచుండెడివారు
                   నిక్షేపములు ధాత్రి నిలుపువారు
క్షితి శివోద్వాహముల్ సేయుచుండెడివారు
                   కొంచక గుళ్ళు కట్టించువారు
ఘనతటాకమ్ము లిమ్మొనరఁ ద్రవ్వెడివారు
                   విరివిగాఁ దోఁటలు వేయువారు
కవిబుధోత్తములకుఁ గామితార్థము లిచ్చి
                   యందంబుగాఁ గృతులందువారు


తే.

సప్తసంతానకర్త లీ సదమలాత్ము
లెపుడు నిహపరసుఖముల నెనయుచుండ్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

43


సీ.

వలవనిచెలువతో మెలగువాఁ డొకకూళ
                   వాసిడించి చరించువాఁడు కూళ
సిరి గల్గి కుడువక చిక్కువాఁ డొకకూళ
                   వనిత కుంకువ చెప్పువాఁడు కూళ
చెడి బంధునింటికిఁ జేరువాఁ డొకకూళ
                   వసుధేశుఁ జెడనాడువాఁడు కూళ
ధనికుతోఁ బగవెట్టుకొనెడువాఁ డొకకూళ
                   వడిలేని దొరఁ గొల్చువాఁడు కూళ


తే.

కూడదన్నను గవితలఁ గూర్చి బలిమి
గుమతులకు నిచ్చువాఁ డొక్కకూళ సుమ్ము,