Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనశతకములగూర్చి శివలీలావిలాసములో సూచనప్రాయముగాఁ జెప్పినాఁడు. వాని పేరులు తెలుపలేదు. శతకదండకసత్కృతుల్ అనినందువలన నవి రకమున కొకటికి మించియుండవలయును.

తిమ్మకవి తాను వ్రాసిన ప్రతికృతిలోను దద్రచనాకాలమును సూచించి విమర్శకలోకమున కొకింత మేలు చేసెను. ఈ క్రింద నతఁడేయే గ్రంథముల నెప్పుడు వ్రాసినది తెలుపు పట్టికను బరిశీలించినచో నతని కాలము సులభముగ నూహింపవచ్చును.

రుక్మిణీ పరిణయము శా.శ. 1637 క్రీ.శ. 1716
సారంగధర చరిత్రము శా.శ. 1651 క్రీ.శ. 1729
భర్గ శతకము శా.శ. 1651 క్రీ.శ. 1729
సర్వలక్షణసారసంగ్రహము శా.శ. 1662 క్రీ.శ. 1740
రసికజనమనోభిరామము శా.శ. 1672 క్రీ.శ. 1750
సర్పపురీ మాహాత్మ్యము శా.శ. ? క్రీ.శ. 1754
శివలీలా విలాసము శా.శ. ? క్రీ.శ. 1756
సింహాచల మాహాత్మ్యము ? ?
నీలాసుందరీ పరిణయము ? ?
రాజశేఖర విలాసము ? ?
అచ్చతెలుఁగు రామాయణము ? ?
కుక్కుటేశ్వర శతకము ? ?

రెండుమూఁడు తప్పఁ బై గ్రంథములలో నన్నియు ముద్రితములే. కడపటి యైదింటి రచనాకాలము తెలియవచ్చుట లేదు. “కుక్కుటేశ్వరశతక” మసమగ్రము. (92 పద్యములే కలవు.) కాని తన ప్రతికృతిలోను కవి స్వయముగాఁ దాను వ్రాసిన గ్రంథముల నొకక్రమము ననుసరించి పేర్కొన్నాడు. అందులోఁ దొలిదైన ‘రుక్మిణీపరిణయమే’ యతని మొట్టమొదటి కృతి. అది క్రీ.శ. 1716 సం॥రమున సాగినది. ఆ తరువాత (1) సింహాచలమాహాత్మ్యము, (2) నీలాసుందరీ పరిణయము, (3) రాజశేఖర విలాసము యీ మూఁటిని వ్రాసినట్లు తెలిపినాఁడు. కాని వాని కాలములు తెలుపలేదు. వీని తరువాత ‘సారంగధర చరిత్ర’ (ద్విపద), ‘భర్గశతకము’ రచించినట్లు చెప్పినాఁడు. ఈ రెండును లఘు కృతులే. వీని నిర్మాణకాలము క్రీ.శ. 1729. కాబట్టి క్రీ.శ. 1715-1729కు మధ్యగల 14 ఏండ్లలో పై మూఁడు కృతుల రచన జరిగియుండుననుటలో నేమాత్రము సందేహము లేదు. సారంగధర చరిత్ర వ్రాసిన క్రీ.శ. 1729కిని, సర్వలక్షణసారసంగ్రహము వ్రాసిన 1740కిని ఆ రీతిగనే మధ్యగల 12 ఏండ్ల వ్యవధిలో “నచ్చతెలుఁగు రామాయణ” కావ్యనిర్మాణము జరిగియుండును. దీనిని బట్టి కవి జీవితకాలమును గ్రహించుట కొంచెము సులభసాధ్యము.

‘రుక్మిణీ పరిణయము’ను వ్రాసిన (1715) కాలమునకు కవికి 25 యేండ్ల ప్రాయమైన నుండును. ఆ పక్షమునఁ దిమ్మన క్రీ.శ. 1690 సం॥ర ప్రాంతమున జన్మించినవాఁడనుట సమంజసము. అతని కడపటి కృతియయిన “శివలీలావిలాసము” క్రీ.శ.1756లో వ్రాయఁబడినది. కనుక నతఁడు దాదాపు 1760 ప్రాంతమువఱకు జీవించి యుండవలయును. ఈ నిర్ణయము సత్యమే యని రుజువు చేయుటకు మఱియొక యాధారము కూడ లేకపో లేదు. తిమ్మకవి-

“రావు మాధవనృప పరిరక్షితంబు భోగనికరంబు పీఠికాపురవరంబు”

అని తాను “రుక్మిణీపరిణయము” వ్రాయు కాలమునకుఁ బీఠికాపురమునకుఁ ప్రభువైన పెద్ద మాధవరావును బేర్కొన్నాఁడు. ఇది 1715 నాఁటి రచన; కనుక నతఁడు ప్రభువుల దృష్టి కెక్కునంత ప్రౌఢుఁడుగా నుండియుండఁడు.

కాని 1760 లో రచించిన ‘రసికజనమనోభిరామము’లో