పుట:కాశీమజిలీకథలు -09.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

శ్లో. అంతర్ముఖోత్తర రథచ్ఛద నేత్రవర్ణం
    స్థానేషేచుంబనవిధిః కధితేషు యోజ్యాః.

ముఖమధ్యమున నుత్తరోష్టమున నేత్రములందు దంతాంకము లుంపఁగూడదని నిషేధమునఁ గనంబడుచుండ నతం డాచోటులఁ గూడ రదనాంకములుంచెను. ఇంతియకాక యొకచోటనుంచు నంకములు వేరొకచోటఁ జూపుచు శాస్త్రము విడిచి యథేష్టముగాఁ గ్రీడావిన్యాసములఁ గావించెను. జయంతునికన్న నలకూబరుఁడే శృంగారకళావిదగ్ధుండని మాకుఁ దోచినదని తీరుపు చెప్పినవి.

అప్పుడు రంభాపక్షమువారు జయ్ నలకూబరా! యని పెద్ద యెలుంగున నుచ్చరింపుచు నృత్యములు సేసిరి.

అప్పుడు జయంతపక్షమువారు తెల్లఁబోయి విచారములతో నా పక్షుల నిందింపుచు దాము వారి కీయవలసిన పణద్రవ్య మిచ్చివేసి మొగంబుల దైన్యంబుదోప నౌత్నపరాభవంబునకు వగచుచు జయంతునొద్దకుఁ బోయి నమస్కరింపుచు నిట్లు విన్నవించిరి.

మహేంద్రనందనా! మే మీనడుమ నొక చిన్నతనముపనిఁజేసి యోడిపోయితిమి. మాకేకాక యయ్యవమానము మీకుఁగూడ సంక్రమించుచున్నది. పదుగురాఁడువారం డొకచోటఁ జేరినఁ దగవులాడక మానరుగదా? మన నందనవనములో నచ్చరలు గుమిగూడి ముచ్చటింపుచు శృంగారలీలాచాతుర్యంబున మీకంటె నలకూబరుం డధికుండని పొగడిన మేమా మాటకు సమ్మతింపక మీరే యధికులని వాదించి పణము వైచితిమి. నారదవాక్యంబునఁజేసి నందనవనంబున నుండెడి పారావతశకుంతముల మధ్యవర్తులుగాఁ గోరుకొంటిమి. అవి మీ యుభయక్రీడావిశేషములఁ బరీక్షించినవఁట. మీరు బాహ్యక్రీడలలో శాస్త్రమును వదలి అధేష్టముగా నడిచిరట. అందు మూలమున మీకుఁ గళావైదగ్ధ్యములేదని యా మూఢపక్షులు తీరుపుఁ జెప్పినవి. వింటిరా? మేమోడినందులకు విచారములేదుగాని త్రిభువనప్రభువగు మహేంద్రుని కుమారుండవు. నీవు కళామూఢుఁడవని చెప్పినందులకుఁ జింతగా నున్నది. నలకూబరపక్షమువారు గంతులువైచుచున్నారు. మన నందనవనంబునఁ జిరకాలమునుండి వసించిన పక్షులు విశ్వాస మించుకంతయుఁ బూనక ప్రతిపక్షులఁ గెలిపించినవి. వాని కావర మడంపలేరా? యని యావృత్తాంతమంతయు నెఱింగించిరి.

అప్పు డతం డొహోహో! మదీయకళావైదగ్ధ్య మెఱింగించుట కాపక్షులా కలాసమర్ధములు! పులుగుల మధ్యవర్తులుగాఁ గోరుట మీకు బుద్ధిలేదా? బృహస్పతి యుండె శుక్రుండుండె మద్విద్యపాటవము దెలిసికొన సమర్థుం డొరుఁడెవండు? యుక్తాయుక్తవివేకశూన్యములగు పక్షులమాట లెక్క సేయనేల? పో పొండు. అని కసరిన విని యబ్బిసరుహాక్షులు స్వామీ? వాని పక్షులని నిరసింపరాదు. నారద వాక్యంబునం జేసి మేము వాని నడిగితిమి. ఇప్పుడు మీరు మీపక్షము నిలువఁబెట్టక