పుట:కాశీమజిలీకథలు -09.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుళిందుని కథ

75

    ఉద్వృత్త స్సచ రాజపుత్ర నినహస్తే నందిన స్తాః కథా
    సర్వం యస్య వశా దగాత్ స్మృతిపథంకాలాయ స్మైనమః.

దేవీ! విను మా విజయపాలుండు కటారిచే భార్యం బొడిచి యాత్మహత్యఁ జేసికొనవలయునని తానుగూడఁ బొడిచికొనెను. కాని యావ్రేటు తప్పుటచే నంతలో నతనికి జీవితాశ జనించినది. తటాలునలేచి ప్రచ్ఛన్నమార్గంబున ? గోటఁ దాటి యవ్వలఁబడియొక యరణ్యమార్గంబునం బోవుచు సుమతిం దలంచికొని ఆహా! సర్వసుగుణసాగరుండవు. ప్రాణదాతవగు నిన్ను నాఁడుదానిమాట నమ్మి యవమానపఱచిన మహాపాపాత్మునకు గృతఘ్నునకు రాజ్యసుఖంబులేల దక్కెడిని? నేను మహా నరకంబులఁబడి ఘోరయాతన లనుభవింపవలసినవాఁడ నే నప్పుడు చావక యేమిటికి బ్రతికితిని? ఎందు బోవుచుంటిని? నాకు గమ్య స్థానమేది? అని యనేకప్రకారములఁ దలపోయుచుఁ బరితపించుచుండెను.

మఱియుఁ గనంబడిన చెట్టుపండ్ల భుజింపుచు వనఝరీజలంబులం గ్రోలుచు క్షుత్పిపాసల నడంచుకొని యొకవనమునుండి మఱియొక వనంబునకుం బోయి పోయి క్రమంబున నుత్తరదేశారణ్యంబులం బ్రవేశించెను. మఱియు,

సీ. ఒకమాటు బాహుబలోద్దతి వైరులఁ
               జెండాడి రాజ్యంబు సేయఁదలఁదు
    నొకసారి మునివృత్తి బూని కానలలోన
              నకలంకతపము సేయంగఁ దలఁచు
    నొకతేప భక్తిసంయుక్తిధాత్రిఁ దనర్చు
              తీర్థంబు లెల్లను దిరుగఁ దలఁచు
    నొకపరి ప్రబలసమున్మత్తవృత్తియై
              మృగములవలెఁ గాన మెలఁగఁ దలఁచు
గీ. సుమతి కడకేగి యతని పాదముల వ్రాలి
    తప్పు సైరింపుమనుచుఁ బ్రార్ధన మొనర్ప
    నెంచు నొకసారి మఱియిన్ని యేల యకట!
    చచ్చుటయే మే లటం నొకసారి యెంచు.

గీ. భూరిసామ్రాజ్యవైభవస్ఫూర్తు లెల్లఁ
    బోయె బంధువు లాప్తులు బోయి రకట!
    యిట్టు లేకాకినై పోవు టెటకొ యహహ!
    బ్రతుకఁ దలచుట తలఁప నద్భుతముగాదె.

ఛీ! నా జీవితము కన్నఁ దుచ్చిమైనది పుడమి మఱియొకటిలేదు. కృతఘ్నత్వకల్మషము వాయ భృగుపాతంబున శరీరంబు విడిచెదనని నిశ్చయించి యొకనాఁ డొకపర్వతకూటంబున నిలువంబడి భగవంతుని ధ్యానించుచు విశాలశిలాతలంబు గుఱి