పుట:కాశీమజిలీకథలు -09.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిత్యవర్మ కథ

55

సంతసించుచు దివ్యరూపసంపన్న యగు తన కూఁతుర నాకిచ్చి వివాహముఁ గావించెను.

విజయపాలుండు వెదకించి నన్నుఁ బట్టుకొనునను భయముతోఁ గొంతకాల మాయగ్రహారమునఁ బ్రచ్ఛన్నముగా వసించితిని. పాపము నేను లేవగొట్టఁబడితినని తెలిసికొని యా విజయపాలుం డసహాయుండని యెఱిగి మధువర్మ మందపాలుని సహాయముగా జేసికొని దండు వెడలి జయపురము ముట్టడించి యా రాజదంపతులం బరిమార్చి యానగరము స్వాధీనముఁ జేసికొని యిరువురు నా దేశమును బాలించుచుండిరి.

నేనావార్త మఱికొంతకాలమునకుఁ దెలిసికొంటిని. విధికృత మసాధ్యము గదా? తరువాత నేను భార్యతోఁ గూడ మహారాష్ట్రదేశంబునకుఁ బోయి తద్దేశాధిపతి నాశ్రయించితిని. అతండు నన్ను మిత్రునిగా భావింపుచుండెను. తదాదేశముననే మృగంబులం దెచ్చుటకుఁ బుళిందు నొద్ద కరుగుచుంటినని తనవృత్తాంత మంతయు నెఱింగించెను.

అశోకవతి యా కథవిని విస్మయసాగరంబున మునుంగుచు నోహో? మిమ్ము సామాన్యు లనుకొంటిని. మీ ప్రభావ మమానుషము. మీ జితేంద్రియత్వము స్తోత్రపాత్రమైయున్నది. కృతఘ్నుండై విజయపాలుండు భార్య చెప్పినమాట విని మిమ్ము లేవఁగొట్టి తానే చెడిపోయెను. స్త్రీలమాయలకు వశము కాని పురుషులుండుట యరుదు. అది విజయపాలుని రాజ్యమా? పాపము. వృధగా నన్యాక్రాంతమైపోయినది. కానిండు, ఆ చింత మాకేల? మీ చరిత్రము విన మీరు మహాబలశాలులనియుఁ బరోపకారపారిణులనియుఁ దెల్లమగుచున్నది. మా రాజవాహనుని విడిపించు నుపాయము మీరే చేయవలయును. మీ పాదంబులకు మ్రొక్కుచున్న దాననని వేడికొనియెను.

ఆప్పు డతం డాలోచించి సుందరీ! తొందరపడవలదు. ముందుగానే నా పుళిందునొద్దకుఁ బోయి మృగంబులం గొని మహారాష్ట్ర దేశంబు బంపెదను. మారాజువద్ద వ్రాసి కొంత సైన్యమును దెప్పించెద ననివార్యముగా శత్రురాజులఁ బరిభవించి రాజవాహనుని విడిపించి యతనినే యారాజ్యమునకు బట్టభద్రునిగాఁ జేసెదఁ జూడుము. శపథముఁ జేసెను.

ఆ మాటలు విని యాపాటలగంధి బ్రహ్మానందముఁ జెందుచు స్వామీ! మీవాక్యము వేదవాక్యము. మీప్రతిజ్ఞ శ్రీరామప్రతిజ్ఞ మీరు సంకల్పసిద్ధులు. నేను గూడ నిప్పుడు మీవెంట వచ్చెద. నా పుళిందుని కీవార్తఁ జెప్పెద. అతనికడ యుద్ధనైపుణ్యము గల శబరసైన్యము లనేకము గలవు. వానితో నతండు మీకు సహాయము జేయగలఁడు. మఱియు శ్యామలాపురభర్త నీరాజవాహనుఁడు జేయఁదలచికొన్నాఁడు. కోరిన సేనల నీయగలఁడు. ఈ సేనల కన్నిటికి నాయకుండవై నీవు శత్రులఁ బరి