పుట:కాశీమజిలీకథలు -09.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిశాచలోకము కథ

175

ప్రధానములగు దానవ్రతాదులు చేసినవారు చేరుచుందురట పుణ్యలోకములలోనెల్ల నదియే తక్కువది. మఱియును

చ. వికృతముఖంబులుం గురుచవెండ్రుకలు న్మిడిగ్రుడ్లు పెద్ద మ
    స్తకములు తొట్టవాతెఱల సాగిసతోరపు గొగ్గిపండు లూ
    చకడుపు లడ్డకాళ్ళు మసిచాయలు గల్గి గడుంగడుం భయా
    నకముగ నాక నక్కడఁ గనంబడె గొన్ని పిశాచరూపముల్ .

అట్టివారిం దూరమునఁ జూచి యది యమలోక మేమోయని వెఱచుచుఁ బది యడుగులు వైచినంత ఖడ్గహస్తులగు పురుష లిరువురు నన్నుఁ జూచి నా చెంతకు వచ్చుచున్నట్లు కనంబడిరి.

నేను వారింజూచి వారు సీమారక్షకులుగాఁబోలు. కనకమణిమయ కటకమకుటాంగలాది విభూషణములచే నలంకరింపఁబడక భయంకరవేషములతో నున్నారేమొకో యని యాలోచించుచుండ వారు నా కడకు వచ్చి నీ వెవ్వఁడవు? ఇందేల వచ్చితివి? అని యడిగిన నే నించుక వెఱపుదోప నిట్లంటి.

అయ్యా! నేనొక పుణ్యపురుషుండఁ గాశీవిశ్వనాథుని యనుగ్రహంబున నీ పుణ్యలోకంబునకు వచ్చితి నిది యేలోకము? మీరు సీమారక్షకులా? ఇందు ప్రధానదండనాధుని పేరేమి? నాటకులెవరు? గాయకు లెవ్వరు? భోగిని యెవ్వతె? అని నీవు వోలె నడిగితిని. వాండ్రు నా మాట విని నవ్వుచు నోరీ? నీ మోసము లింక సాగవు. ఇది పిశాచలోకము. మేము దేవదూతలము. నీవు తీర్థశుల్క నెత్తికొని పోయిన దొంగవు. నేఁటికిఁ దొరకితివి. నీ కొఱకే దేవలోకములన్నియు నింద్రుండు కాపు పెట్టించెను. పాపము నీ వది యెఱుంగక వెనుకటి వలెనే వచ్చి యందలి భోగిని నెత్తుకొని పోవలయునని తలంచితివి కాఁబోలు. బడిశములోఁ బడిన మత్స్యమువలెఁ జిక్కితి వెందుఁబోగల వని పలుకుచు వారు నా చేతులు గట్టివైచి లాగికొని పోయి యూ బోనులోఁ బెట్టి యింద్రుని కడకుఁ దీసికొనిపోయిరి.

వయస్యా! నాకు దీనిలో నుండుటచేఁ గన్నులారఁ బుణ్యలోకములఁజూచు భాగ్యమైన గలిగినది కాదు. ఇతరుల మాటలు మాత్రము వినంబడును. ఈ పెట్టె నా యింద్రుని నికంబున బెట్టి దేవదూతలు నా తెఱం గెఱింగించుచుండ నీ మామ నిరృతి మహారాజు అక్కడికి వచ్చెను. దేవదూత లాయన రాక మహేంద్రుని కెరింగించిన మాటలు నాకు వినంబడినవి.

ఎదురు వచ్చి సురపతి నిరృతిని దీసికొనిపోయి తన ప్రక్క గూర్చుండఁబెట్టుకొని స్వాగతపూర్వకముగా గమనకారణం బడుగుటయు నతం డిట్లనియె ౼సురసార్వభౌమా? తీర్థశుల్కను రక్కసు లెత్తికొని బోయిరని మీరు భ్రాంతి పడితిరి. అదివట్టిదిసుఁడీ? మీ యాజ్ఞవడుపున రక్కసుల నెల్ల సన్మార్గప్రవర్తకుల