పుట:కాశీమజిలీకథలు -09.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీర్ధశుల్క కథ

149

ఉన్నవారు వినోదములన్నియుఁ జరుపుచున్నారు. నీవెఱుంగవా? అని యడిగిన నతండు వెఱగుపాటుతో నిట్లనియె.

ఏమేమీ? ఆ పుణ్యపురుషుఁ డింద్రునికిఁ దెలియకుండ నెట్లు వచ్చెను? వాఁడెవ్వఁడు ? ఎవని యాజ్ఞచొప్పున వచ్చెను? వింతగా నున్నదే? వారణాశీ పురంబున నొక యాత్రికుఁడు రేపు మృతినొందునఁట. వాని విమానంబునం దీసికొని వచ్చి తేజోలోకంబునఁ బ్రవేశ పెట్టుమని దేవదూతల కాజ్ఞాపించుచు నన్నుఁజూచి నీవు పొమ్ము. ఆ తీర్థవాసి రేపు మీలోకమునకు రాఁగలడు. తీర్థశుల్కతోఁగూడ భోగము లనుభవించుచుఁ బదివత్సరములు మీలోకమున నుండఁగలఁడు. వాని కిష్టమ్ములగు నుపచారమ్ములఁ గావింపుచు సేవించుమని యాజ్ఞాపించుటయు మహాప్రసాదమని యింద్రునియనుజ్ఞఁబుచ్చుకొని వచ్చితిని. నడుమ వీఁడెట్లు వచ్చెనో తెలియకున్నది. మహేంద్రుని వచనంబుల కన్యధాత్వమ్ము గలుగునా? కానిమ్ము. వానినే యడిగి నిజము దెలిసి కొనియెదంగాక యని నిశ్చయించి యా మణిభద్రుఁడు నాయున్న ప్రాసాదమ్మునకు వచ్చెను. నేనప్పుడు సభాంతరాళమున వసించి విద్యాధరుల సంగీత మాకర్ణించుచుఁ బెద్దతడవు వానికి మాటాడుట కవసరమే యిచ్చితినికాను. వాఁడందుఁ బ్రధానదండనాయకుండు గావున హస్తసంజ్ఞచే వారినెల్ల నూరకుండుఁడని, వారించుచు నాకు మ్రొక్కి అయ్యా! మీరెవ్వరు? ఎవ్వరియాజ్ఞానుసార మీపుణ్యలోకమునకు వచ్చితిరి? నేనిందుఁ బ్రధానరక్షకుండఁ బుణ్యపురుషుని రాఁక దెలిసికొనుటకై స్వర్గమున కరిగితిని. రేపొక పుణ్యపురుషుండు మీలోకమునకు వచ్చుచున్నాడు. పోయి యుపచారములఁ గావింపుమని యనిమిషపతి యానతీయ వచ్చితిని. ఇరువురు పుణ్యపురుషు లొకలోకమం దెప్పుడును వసింపరే. నతండు వచ్చును. తీర్థశుల్క కాతఁడే భర్త. ఈ లోకము నాతఁడే పాలించు నిందులకు మీరేమి చెప్పెదరు? అని యడిగిన నేనించుక యాలోచించి యిట్లంటిని.

ఓరీ? మాణిభద్రా! నీవు నాకు దాసుండవై యధికారము జూపుచున్నావే? శ్రీకాశీవిశ్వనాథుని యాజ్ఞచొప్పున నేనిందు వచ్చితిని. అమ్మహాత్ముని యాజ్ఞనతిక్రమింప మహేంద్రుఁ డెంతవాఁడు! పో పొమ్ము, నీయింద్రునితోఁ జెప్పుకొమ్మని మొండిధైర్యముతో నదలించితిని. వాఁడించుక కొంకుచు దేవా! విశ్వనాథుండు సర్వాధికుఁడగుట నిక్కువమే. తామేర్పరచిన నియమంబులు వారే యతిక్రమించిన నెట్లు సాగును? తాము మీకట్టివర మిచ్చినప్పుడు మహేంద్రునికిఁ దెలిపిన నడుగులకు మడుగు లొత్తుచు మిమ్మా పురుహూతుఁడే యిందుఁ జేర్చుంగదా! అని మెల్లగాఁ బలికిన విని నేనిట్లంటిని

మాణిభద్రా! మహేంద్రుఁడు నీతోఁ జెప్పిన పుణ్యపురుషుండ నేనే యగుదును. అతండు మొన్ననఁబోయి రేపని చెప్పెనని తలఁచెదను. ధీమంతులకుఁగూడ ప్రమాదములు వచ్చుచుండును. వెఱవక నీవిందుండుము. ఇంద్రుండు నీపై గోపిం