పుట:కాశీమజిలీకథలు -09.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అని భక్తిరసవివశమానుండనై ధ్యానించి మఱియు నందుఁగల దేవతలనెల్ల నారాధించి సాయంకాలమున దివ్యభూషాంబరాలంకృతుండనై గంగయొడ్డునఁగూర్చుండి యాకసమువంకఁ జూచుచుండ సూర్యుం డపరాంబునిధిఁ గ్రుంకువెట్ట సంజపెంపుక్రమంబున నంతరింపఁ జుక్కలొక్కటొక్కటిగా నంతరిక్షమునం బ్రత్యక్ష మగుచుండెను. అప్పుడు నేనిట్లు తలంచితిని.

ఇప్పుడు సూర్యలోకంబునకుఁ బోవుటకు దలంచితినేని యందుఁబోయి సంపాతివలె దగ్ధమై పోవుదును. చంద్రలోకంబునకుఁ బోయిన నీరు గారును. మఱియు గ్రహనక్షత్రాదిలోకంబు లెట్లుండునో యెఱుఁగరాదు. ప్రాక్పశ్చిమదిక్కులజోలికిఁ బోఁగూడదు. ఉత్తరము దెసఁగూడ హిమప్రాచుర్యమగుట దుష్ప్రావకమై యుండును. అని తలంచి దక్షిణదిక్కునఁ గ్రిందుగానున్న యొక చిన్నచుక్కపై ద్రుక్కు వ్యాపింపఁజేసి యిందుఁ బోయిన నిర్బాధముగా నుండును. అది తేజమో రత్నమో లోకమో యేదియో యొకటి కావలయుంగదా ? దానింజూచినఁ దక్కినవన్నియు నిట్లే యుండునని నిశ్చయించుకొనవచ్చును. అది యొక్కటిగాక మఱియొక్కటిగూడఁ జూడఁ గురుఁడు ననుగ్రహించి పసరిచ్చెంగదా? ఇప్పుడా నక్షత్రము దాపునకే పోవుట కర్జము. అని యాలోచించి బరిణిలోని పసరు మూఁడవ వంతు పాదములకు రాచికొని కన్నులు మూసికొని జయ పరమేశ్వరా! జయ విశ్వనాథ! జయ యన్నపూర్ణా మనోనాథ! నేనిప్పుడు గురుప్రసాదలబ్దౌషధప్రభావంబున నానక్షత్రలోకంబునకుఁ బోవలయునని ధ్యానించి యంతలోఁ గన్నులం దెరచి చూచితిని.

తీర్ధశుల్క కథ

ఆ. వె. కుదుపులేదొకింత కదలినట్టును లేదు
         మీఁదికెగిరినట్టులదు నాకు
         నెట్లుపొతినొక్కొ యెఱుఁగంగరాదొక్క
         కొత్త నగర మెదుర గోచరించె.

నలుమూలలు పరికించి చూచితిని. భూలోకవిలక్షణముగాఁ గనంబడినది క్రిందికిఁ జూచితిని. నే నిలువంబడియున్న తావు స్ఫటికశిలాఘటితమై స్నిగ్ధమై ప్రతిబింబము గనఁబడుచున్నది. మఱియు విమర్శింప నేనున్న దొక పుష్పవనము. అందలి లతావితానమున కాలవాలములు లేవు. చిత్రలిఖితములట్ల స్ఫటికశిలావేదికలపై నాఁటబడియున్నవి. అవి మనోహరకుసుమవిసరబహుళదళసల్లలితవల్లవల్లరీ సముల్లసితములై నాసాపర్వముఁ గావింపుచున్నవి. ఆహా! తత్ప్రసూనసౌరభ్యం బనుభవైకవేద్యము. మఱియు నాకల్లంతదవ్వులోఁ గనకరత్నప్రభాధగద్ధగితము లగు శిఖరములచే మెఱయుచున్న ప్రాసాదములు గొన్ని కన్నులపండువు గావించినవి. అది పగలో రాత్రియో చెప్పఁజాలను. వయస్యా! వెనుకటి వృత్తాంతము మరచిపోయి నే