పుట:కాశీమజిలీకథలు -07.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

కాశీమజిలీకథలు - సప్తమభాగము

తివి? తల్లీ ? యెన్నియిడుమలంబడితివి సఖీ ? యెట్టి కృతజ్ఞురాలవు యెట్టిమహిమ సంపాదించితివి అని యబ్బురపాటుతో నామెం గౌఁగలించుకొని రాజపుత్రీ! స్వర్గమర్త్యపాతాళములలో నీవంటి పుణ్యాత్మురాలు లేదు. నీమైత్రివలన నేనును గృతార్దురాలనైతినని పెద్దగా బొగడినది.

చాలుఁజాలుఁ ఎదురు నన్నుఁ బొగడుచుంటివా? నీ సుగుణములలో సహస్రాంశము నాకడలేదు. నీ సత్యము నీ యౌదార్యము నీపరోపకృతియే సుకృతికిఁ గలదు. పోనిమ్ము మనమిద్దరము ఇందుఁ దపంబు జేసికొనుచుండుదము దేహయాత్ర నడువఁగలదని పలికిన యోగసక్త యిట్లనియె.

దేవీ ! మేమీ ప్రపంచముచూచి రోసితిమి?. నీవు చూడకయే రోయుచుంటివి. అయినను అప్పురాణ మునిదంపతులు నిన్నింటికిఁ బోయి పెండ్లి యాడుమని యానతిచ్చిరి కదా ! అ వైభవము కొన్ని దినము లనుభవించి పిమ్మట తపంబు జేసికొన వచ్చును.

తపమనఁగా ముక్కుమూసుకొను కూర్చుండుటగాదు. శమదమాది గుణంబులు గలుగుటయే తపము. సత్యము తపము, దానము తపము, కృతజ్ఞత తపము, సుగుణంబులన్నియుఁ దపంబులు. కావున నీవు గావించన తప మేమహర్షులు చేయలేదని వ్యాఘ్రసేవయే చెప్పుచున్నది. నీవిఁక నింటికిబోయి యా ప్రభాకరుని బెండ్లి యాడుము. సౌఖ్యమొందగలవని‌ యుపదేశించినది.

జితవతి యేమియు మాటాడక కర్తవ్యంశాము గుఱించి వితర్కించుచున్న సమయంబున నగ్రవసువు భార్య తేజోవతి యచ్చటికి వచ్చి సోదరీ యేమిజేయుచున్నావు? నీకొక శుభవార్త చెప్పెద నిటురమ్మని పిలిచినది. సంతోషముతో లేచి యోగసక్త వాకిటకుఁ బోయి తోడితెచ్చి యుచితాసనాసీనం గావించినది.

జితవతి లేచి యామెకు నమస్కరించుటయు నబ్బురపాటుతో జూచుచు నీ యోగిని యెవ్వతె? నీకీమె పరిచయ మెందుఁ గలిగినదని యడిగిన యోగసక్త పిమ్మట నీమె వృత్తాంతము జెప్పెద నీవుదెచ్చిన శుభోదర్క మేమనవుఁడు. తేజోవతి యిట్లనియె.

వసువులెల్ల శప్తులై భూమిలో జనింపఁ దలిదండ్రు లెవ్వరని యా లోచించుఁ బోవుచుండ దారిలో బ్రహ్మశాపతప్తయగు గంగా మహాదేవి యెదురు పడినదట. వసువులామెతోఁ దమపాట్లు జెప్పికొనిరి. ఆమెము వారికిఁ దమశాపప్రకార మెఱింగించి వానినెల్లఁ దనయందు జనించునట్లు నియోగించినదఁట.

పిమ్మట అద్దేవి శంతనుఁడను మహారాజును భర్తగా వరించి వసువుల నందఱ