పుట:కాశీమజిలీకథలు -07.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జితవతికథ

3

లెల్ల నేమియేమని బిదరు గదుర నడుగుటయుఁ దన్మణిఘాత వేదన నించుక సూచించుచు అమ్మించుబోఁణి సఖులారా! అదిగో చూడుఁ డాకసంబునుండి నా చేఁత నేదియో పడినది. అని యంతికమున వింతకాంతుల మెఱయుచున్న యమ్మణిభూషం జూపినది.

రోహిణి దానింగైకొని విమర్శించి యమ్మన చెల్లా! ఇది దివ్య మణిమండనము. తారావల్లభుండు స్తుతీగీతంబుల కలరి యీ యోషా మణికిఁ బారితోషికముగా దీనిం డిగవిడచెనని తలంచెదను ఆహా! ఈ దివ్యరత్నంబు లెంత వింతగానున్నవి! అని పొగడుచుండ నందున్న సుఖరాండ్రెల్ల నేది యేది యని మూఁగి దాని లాగికొనఁ దొడంగిరి.

రాజపుత్రికయుఁ గరపుటవేదవం బించుక యడంగిన పిమ్మట నిటుతెమ్మని యత్తొడవందుకొని వెరగుపాటుతోఁ జూచుచు అయ్యారే ! ఇది శిరంబున ధరింపఁదగిన నగుయగును దీనిం జైవాతృకుండు మనకుఁ ప్రసాదించెనని తలంచుచుంటిరా ? భక్త దీనికుండు మనకుఁ ప్రసాదించెనని తలంచుచుంటిరా? భక్త పరతంత్రుడగు అతండట్లు చేసినంజేయవచ్చును. మఱియు దేవతా మిధునములు విమానము లెక్కియంతరిక్షమున సంచరించుచుందురు. ఏవేలు జవరాలి శిరోభూషణమిందు జారి పడినదో తెలియరాదు. ఎట్లయినను దీనిం దేవసమానముగా నెంచి పూజింపవలయును. అని పల్కుచు అక్కలికి యంతరిక్షమువంక వీక్షణంబులఁ బ్రసరింపఁజేసినది

అప్పుడాకసమునుండి బలమైన మెఱపుతీగ క్రిందకు వచ్చుచున్నట్లు గనంబడుటయు అక్కుటిలాలక సఖులతో "అటు చూడుఁడు మనకు వింతలపై వింతలు గనంబడుచున్నవి. ఆ తేజోరాశి యెద్దియో విమర్శింపుఁడు. అదిమనదెస వచ్చుచున్నట్లున్నది. అనుటయునక్కాంత లక్కజపాటుతోఁ జూచుచు దేవకాంత దేవకాంత. ఒరుల కంతరిక్ష సంచారము కలుగనేరదు. భగవతీ రక్షింపుము రక్షింపుమని కేకలువేయుచుండ నారాజపుత్రిక సఖులతో చేతులెత్తి మ్రొక్క, దొడంగినది. అంతలో అంతరిక్షము నుండి యొక కాంతారత్నము వారి మేడమీఁదకి దిగి కలయంజూచుటయు నబ్బిబ్బోగవతు లతిసంభ్రమముతో

సీ. చెలియోర్తుమణి భర్మసింహాసనమొసంగె
             నర్ఘమర్పించెఁ దొయ్యలియొకర్తు
    పాద్యమిచ్చె సరోజ పత్రనేత్ర యొకర్తు
             వింజామరంఁబూని విసరె నొకతె