పుట:కాశీమజిలీకథలు -07.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సురసకథ

243

కొక శ్లోకమువ్రాసి యంపెను. ఆతండా శ్లోకము జదివికొని మామగారి యభిప్రా యము గ్రహించి మఱియు నీక్రింది శ్లోకము వ్రాసియంపెను.


శ్లో. ప్రధమ పరిగతాయాం బాలికాయాంచ చేష్టాం
    తమశిరహసిబాహుః సంస్తుతాయాంతరుణ్యాం
    క్షణమిహపరిరభ్యం పూర్వకాయేన కుర్యాత్‌
    ముఖమభివదనేన స్వేసతాంబూలదానం.

ఆశ్లోకము జదివికొని యగ్నివర్మ ప్రపరుండు కన్యావిస్రంభణ ప్రకరణ మెఱింగినవాఁడు వానిలోపములేదు. సురసచిత్తంబునఁగామ ప్రవృత్తి గలిగినదికాదు. కొన్నిదినముల దనుక దానికి భర్తృసంపర్కము మానిపింపవలయును.


క. వలరసము సతికిఁ బుట్టకఁ
   బలిమిని బురుషుండు కడఁగిపై కొనుటెల్ల న్‌
   మలయజము సానమీఁదను
   జలముంచక తీసినట్టి చందము సుమతీ.

అని భార్యకు జెప్పుటయు నామెయుఁ గొన్నిదినంబులు నిరీక్షించి నడుమ నడుమఁ బుత్రికకు బోధించియు సదుత్తరంబు బడయజాలక నొకనాఁడు భర్తతో నిట్లనియె.

మనోహరా! మన సురసకుఁ బదునెనిమిదేఁడులు దాటవచ్చినవి అవయవ స్ఫూర్తి బూర్తిగా గలిగినది. పురుషాపేక్షయించుకయుఁ బొడమునట్లు తోచదు. అల్లుఁడు చాలమంచివాఁడు. ఎన్నిదినములు పేక్షించి యుండును. ఆతఁడు వేరొకతెం బెండ్లి యాడునని నయమున భయమునంజెప్పితిని. అనురక్తియేమియుం గలుగలేదు. ఇంక గలుగునట్లును దోచదు. అల్లునిం దెచ్చి యింటఁ బెట్టుకొంటిమి. దౌహిత్రలాభ మాకాశకుసుమ మైనది. కూఁతునెట్లు మందలించుకొందురో చూచుకొనుఁడు. అని పలికిన విని శ్రోత్రియుఁడు ఇంచుక ధ్యానించి యిట్లనియె.

ఇఁక మనమెన్ని జెప్పినను దానికిఁ గామగుణము గలుగదు. రూపమా మోహ జనకము. ప్రాయమా మొదటిది. బుద్ధియా కడుచురుకు విద్యయా అనపథ్యము. ఇట్టి యువతి మగఁడనిన బెగడందుచుండ నేమనుకొనవలయును.

ఆది స్వయంప్రభవలె బ్రహ్మచారిణియై యుండును. ఎఱుఁగక పెండ్లి చేసి తిమి. ప్రవరునిం బ్రతిమాలికొనియెదను. మఱికొన్ని దినంబులుపేక్షించి చూడఁ గలడు. మనమెట్లు చెప్పిన నట్లు చేయువాఁడే సురసను మందలింపవలదని చెప్పిన నామె యిట్లనియె.