పుట:కాశీమజిలీకథలు -07.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మిని కథ

179

చెప్పుము తండ్రీ! మందులకొఱకు మీవారు పోయితిరంటిని. బ్రతికించు మందులున్న వియా? నాయనా ! యెఱింగింపుము నీ వెంటవత్తును నన్నక్కడికిఁ దీసికొనిపొమ్ము. పుత్రా ! అని పిచ్చిదానివలె అడలుచుండ వాఁడు తల్లీ! వారికేమియు భయములేదు మాకొండలలో పాము చెక్కలు చాలఁగలవు. గాలిలేకపోయెనను గంధము రాచిన బ్రతుకఁగలఁడు. రమ్ముఁ పోవుదము. నీవు ఏడువకుము. అని యోదార్చుచు నా కిరాతుఁడా నాతిని గురుదత్తుఁడున్న తావునకుఁ దీసికొని పోవుచుండెను.

ఒకచోట నొక చిన్న మెట్టయెక్కుచుండ అయ్యండజయానకుఁ బ్రసవవేదన యావిర్భవించినది. నేలం జదికిలఁబడి యోరీ? నేఁనిక నడువలేను. కడుపులో నేదియో బాధగా నున్నది నీవు పల్లెకుఁబోయి యాఁడువాండ్రం గొందఱిఁ దీసికొనిరమ్ము. వడిగా రమ్ముఁ అని చెప్పి వానింబంపినది. క్రమంబున నొప్పు లధికమగుచుండెను. ఓదార్చువారు లేరు. భర్త సర్పదష్ఠుడై పడియున్నవాఁడను వార్త వినియుండెను. అట్టి తరి నత్తలోదరి చిత్తమెట్లుండునో యూహింపవలయును.

అక్కుసుమకోమలి ప్రసవాయాసము సైరింపలేక యొడలెఱుంగక నేలం బడి పోయినది. అంతలో నాకాంతా రత్నమున కొక కుమారరత్న ముదయించెను. గాని యా మానవతి యేమియు నెఱుఁగదు. మఱిరెండు గడియలలో నాకిరాతుఁడు కొందఱ నాఁడువాండ్ర వెంటఁబెట్టుకొని అచ్చటికి వచ్చెను. శిశువు వారికిఁ గనంబడ లేదు. తొందరపడి కిరాతస్త్రీలు పద్మినిం బట్టుకొని తుడిచి కట్టులుకట్టి కాచి చెక్కరసము పూసి యుపచారములు చేయుచు నెత్తుకొని తమపల్లెకుఁ దీసికొనిపోయి పండుకొనఁ బెట్టిరి.

పెద్దతడవున కామెకుఁ దెలివివచ్చి హా ! ప్రాణనాధా! హా! మనోహరా ! అని విలపింపఁ జొచ్చినది కిరాత వధూటులూరడింపుచుఁ దల్లీ ! నీవు గన్నపుత్రుఁ డేమ య్యెను నీవు ప్రసవమైతివే మాకు గనంబడలేదని అడిగిన నప్పడఁతి అమ్మయ్యో? నేనేమియు నెరుఁగను. అయ్యాశయు భగ్నమైనదా ! ఔరా ! కాలమహిమ ! పోనిండు. నాభర్తయేడీ? జీవించియున్న వారా? అని అడిగిన వాండ్రిట్లనిరి. అమ్మా అక్కడి వాండ్రింకనురాలేదు. నీకొరకై మేము అడవికి వచ్చితిమి. మేము వచ్చునప్పటికి నీవు వివశవై పడియుంటివి. నిన్ను మోచుకొనివచ్చి చికిత్సలఁ జేసిన బ్రతికితివని యావృత్తాంత మంతయుం జెప్పిరి.

అప్పుడు పద్మిని మిక్కిలి అడలుచుఁ దానుగనిన శిశువు నేమృగమో యెత్తి కొని బోయినదని నిశ్చయించి తచ్ఛోకము హృదయమునంటనీయక పతిపాదాయత్త చిత్తయై యవ్వార్తకొర కెదురు చూచుచుండెను. అంతలో నచ్చటివారలువచ్చి ధైన్య