పుట:కాశీమజిలీకథలు -07.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోమిని కథ

173

ఆపుణ్య దంపతు లిరువురు తెల్లవారకమున్న యెవ్వరికిం జెప్పకయే యేకాంతముగా నిల్లు విడిచి దేశాంతర మఱిగిరి.

కుముదాంగదుఁడు వాడుకప్రకారము పెందలకడలేచి ప్రాతఃకృత్యములు నిర్వర్తించి అల్లునితో ముచ్చటింప నతని గదిలోనికిం బోయెను. తలుపులు మూయఁ బడి యున్నవి. గురుదత్తా? లెమ్ము లెమ్ము ప్రొద్దెక్కినది. నేను ఆస్థానమున కరుగు చున్నాను. రాజు రేపువచ్చునప్పుడు నిన్నుఁగూడ. నగరికిఁ దీసికొనిరమ్మని చెప్పి యున్నాడు పోవుదము అన చీరియు నెంతసేపటికినిఁ బ్రతివచనము గానక తలుపు త్రోసి లోపలికిఁబోయి నలుమూలలు వెదకి యెందునుం గానక తొందరపడుచుఁ బడక గదిలోనికిం బోయి కొమరితం బిలిచెను.

ఆమెయుం గనపడలేదు భార్యంబిలిచి మనవాళ్ళు మేడమీఁద లేరేమి? నీతోఁ జెప్పి యెక్కడికైనం బోయిరా? అని అడిగిన నా యిల్లాలు అయ్యో! నాకేమియుం దెలియదు. ఎందుఁబోవుదురు? అమ్మాయి యింత ప్రొద్దెక్కుదనుక లేవలేదని శంకించు కొనుచుంటి చూఁడుడు అని తొందరగాఁ బలికినది. ఇరువురు మేడలన్నియు వెదకిరి ఎందునుం గనంబడలేదు. భార్య దుఃఖించుచుండ నూరడింపుచు నాకు రాజసభకుఁ బోవువేళయైనది. రాజుతోఁజెప్ప సెలవుతీసికొని వత్తును తొందరపడకుము. రాత్రి పండుకొనిరిగదా? మన మొల్లమని చెప్పకుండ బుట్టినింటికిఁ దీసికొనిపోయెనేమో? ఎద్దులును, బండియు నేకమైన మనమేమి చేయగలము. అని వలుకుచుఁ దాను రాజ సభకుఁబోయెను.

నాఁడు రాజు సభకు రాలేదు. మంత్రులు అత్యవసరకార్యములకై రాజ్ఞ నిమిత్తము వేచియుండి శుద్ధాంతరక్షకుల రాజువార్త నడుగుటయు వాండ్రు రాత్రి‌ యుద్యానవనములోఁ బండుకొనిరి. యింటికి రాలేదని చెప్పిరి.

కొందఱుమంత్రులు కేళీవనమున కరిగిరి. అందురాజు లేడనువార్తఁదెలిసి, కొని శంకాకులితస్వాంతులై వితర్కపూర్వకముగా వెదకింపఁదొడంగిరి. కరటు నడుగుటయు నతండు నాకేమియుం దెలియదు. గోమిని నడుగుఁడని మంత్రులకుఁ జెప్పెను. విమర్శింప రాత్రి గోమినియు నృపతియు నాయుద్యానవనములో నేకాంత మాడినట్లు తెలియ వచ్చినది.

గోమినిని రప్పించి నీవు రాత్రి రాజుతో మాట్లాడినట్లు తెలిసినది. ఆతండెందుఁ బోయె నెఱిగింపుమని యడుగుచుండ నది సందియమందు డెందముతో నాకేమియుం దెలియదని యుత్తరమిచ్చినది. అంతలో రాజభటులు హాహాకారధ్వనులతో వచ్చి సురూపునెవ్వరో కత్తితో నరికి పెంటకుండులోఁ బారవైచిరి. పురసమ్మార్జన కారులా