పుట:కాశీమజిలీకథలు -07.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పెంటనెత్తుచుండ నడుగున నొడయని శవము గనంబడినది. పౌరులెల్లరు గుమిగూడి చూచుచుండిరి. కుముదాంగదునియింట ముంగలకుండులోఁ గనంబడెనని మంత్రుల కెరింగించిరి.

మంత్రులందఱు దండనాథపురస్సరముగా నచ్చటికిబోయి కంఠము నరకఁబడి యున్న రాచపీనుఁగునుజూచి మంత్రులు విలపింపఁదొడఁగిరి. మేనంతయు మణిమ యాలంకారములచే నలంకరింపఁ బడియున్నది.

ఆశవమును పల్లకీ పై నెక్కించి నగరిలోనికిం దీసికొనిపోయిరి రాజభార్యలు బంధు వులు విలపింపదొడంగరి. కారణమెవ్వరికిందెలియదు. మంత్రులు గోమినినిఁనిర్భంధించి యడుగుటయు నది యధార్థముజెప్పినది అప్పుడు మంత్రులు రక్షకభట యుక్త ముగాఁ గుముదాంగదుని యింటిఁకి బోయి ముట్టడించిరి పశవులశాలలో రక్తచిహ్న ములన్నియుం గనంబడినవి ఇల్లుశోధింపఁ బద్మిని వ్రాసిని యుత్తర మొకటి‌ దొరికి నది.

రాజు చేసిన దుర్నయమే రాజుంజంపినదని మనంబులఁ దలంచియు మంత్రులు దండనీతిప్రకారము కుముదాంగదుని నిర్భంధించి మీవారెందుఁ బోయిరో చూపింపు మని అడిగిరి.

అతడు తనకావిషయము మించుకంతయుఁ దెలియదనియు వారిజాడఁ దెలిసి కొనుటకే సెలవు కోరుటకై రాజసభకు వచ్చితిననియు లోనగు మాటలు చెప్పి దృష్టాంతములుజూపి చెరసాలఁ బెట్టకుండఁ దన్నుఁ గాపాడు కొనియెను.

మంత్రులు సురూపున కపరసంస్కారములు నిర్వర్తింపజేసి సామంతచక్ర వర్తియగు గజేంద్రవాహనుని యాజ్ఞానుసారము తామే రాజభారమువహించి పాలిం చుచు గురుదత్తునిఁ బద్మినినిఁ గనంబడిన వెంటనే పట్టుకొని తీసికొనివచ్చనట్లు నానా దేశములకు దూతలం బంపుచు నాయాభూపతులకు వారు చేసిన రాజ్యద్రోహపరాధ మును బ్రకటించిరి. మరియు గూఢచారులు బెక్కండ్ర నియమించిరి. కుంభీనసపు రంబునకుఁ గొందఱు రాజభటులు పోయి అందున్న రాజు నానతిఁగైకొని రత్నా కరుని యిల్లుముట్టడించి వారిం బరీక్షించిరి. కాని యందునుఁ గనంబడలేదు.

రత్నాకరుఁ డావార్తవిని పిడుగు మొత్తినట్లు నిశ్చేష్టితుండై కొంతవడికి తెప్పి రిల్లి గదాధరుని రప్పించి యిట్లనియె.

గదాధరా ! నీవు మావానిం దీసికొనిరాక యత్తవారింటి కడ విడిచి వచ్చితివి. వానిభార్యను రాజువలచుటచే వానిం గడదేర్చి వారిద్దరు పారిపోయిరఁట పట్టుకొనుటకు రాజభటులు దేశములు తిరుగుచున్నారు. దొరికిన వారిం బ్రతుకనీయరుగదా భయపడి