పుట:కాశీమజిలీకథలు -04.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహామాయ కథ

83

విభీషణుని రక్షించినది బూటకమా? పుండరీకుని సాకినది మృషయా? అనేక భక్తులను రక్షించిన మహానుభావుని నధికుఁడు కాడనినఁ గన్నులు పోకుండునా?

రాజ — ఓహో ! మీకు మా మాటలే యర్దముకాలేదు. వెనుకటి గాథలు వలదు. ఇప్పుడు మాకు నిదర్శనము చూపినచో మీ మతము స్వీకరింతము. లేనిచో దూరముగాఁ బొండు.

వైష్ణ – శైవులు మాత్రము శివుం డుత్తముండైనట్లు ప్రత్యక్షము చూపఁగలరాయేమి?

రాజ - ఆ మాట మీకేల మీ మతము గుఱించి మీరు మాటలాడుఁడు. మీ దైవము మీకుఁ బలుకునా ?

వైష్ణ - శ్రీరంగము, తిరుపతి, ద్వారక, కంచి లోనగునవి విష్ణుక్షేత్రములు, పైదివ్యక్షేత్రములయం దట్టిమహిమ కనబండును గాని యిక్కడ గనఁబడదు .

రాజ — ఇచ్చట మీరేమియుఁ బ్రత్యక్షముఁ జూపలేరు కాదా ?

వైష్ణ -- ఇచ్చట జూపలేము.

రాజ - దూరముగా గూర్చుండుడు. (అని మఱియు) శివుఁడు సర్వోత్తముఁడని చెప్పు పండితులు లేచి ముందుకు రావలయును.

శైవు -- చిత్తము. చిత్తము. మేము మేము.

రాజు – అవియన్నియు నేమి ?

శైవు - గ్రంథములు. వీనిలో శివుఁడు సర్వోత్తముఁడని నిశ్చయింపఁబడియున్నది.

వైష్ణ -- (లేచి) గ్రంథములు పనికిరావు. ప్రత్యక్షముఁ జూపవలయునఁట. ఇవియే నమ్మినచో మా వద్దఁ పదిబండ్ల తాఁటియాకుల కట్టల గ్రంథము లున్నవి. ఏమి ప్రయోజనము.

రాజ - మీరు లేచెదరేల? కూర్చుండుఁడు. మాటాడవద్దు మీ గ్రంథములతో మాకుఁ బనిలేదు. ప్రత్యక్షముఁ జూపవలయును.

శైవులు - అందులకు సందేహమేల? వినుండు. పూర్వ మొకప్పుడు కంచిలో నీ విషయమై వైష్ణవులకు శైవులకుఁ దగవు వచ్చినది. అప్పుడు వైష్ణవబాలు డొకండు శివభక్తుడై యెఱ్ఱగాఁ గాలియున్న చెఱకు పెనముపై నాట్యముచేయుచు శివుండు సర్వోత్తముఁడని పాడుచు గొన్ని శ్లోకములు రచించెను. అవి వినినచో మీ సందియము తీరఁగలదు.

శ్లో॥ ఏకనిపాపా భువనభీషణ కాలకూటం. అని చదువునప్పుడు,

రాజ - (వారించుచు) మీ యట్టి ఛాందసులతో మాటాడుటయుఁ గష్టముగదా ? మొదటిగాథలు వలదని చెప్పుచుండ నా కథలు చెప్పెదరేల ? అవి యన్నియు