పుట:కాశీమజిలీకథలు -04.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11]

మహామాయ కథ

81

నవి. వెనుక వేదవ్యాసుఁడు కాశీలో నారాయణుం డుత్తముండనువఱకుఁ గంఠంబుజస్థంభమైనది . మేము చెప్పనక్కరలేదు. వితర్కించిన మీకే తెలియునని యెన్నియో దృష్టాంతములు చూపి వారి చిత్తములు శివునందు లగ్నమగునట్లు చేసిరి. అప్పుడా రాజపుత్రులు వారి మాటలు నమ్మి సరే మేము రేపు వైష్ణవుల రప్పించి మా యొద్ద నబద్దము లేమిటికిఁ జెప్పవలయునో యడిగెదము. మీరును వచ్చి సమధానముఁ జెప్పుడని పలికి యాలయము వదలి బండ్లెక్కి మఱికొంత దూరము పోయిరి. అందు దుర్గాలయము కనంబడినది. దానింజూచి యిదియేమి యని యడిగిన సహాయులు అయ్యా! ఈమె యాదిశక్తి దేవతలను త్రిమూర్తులను సైత మీమెయే సృష్టించినట్లు చెప్పుదురు. జనులు మనము చూచిన దేవతలనట్లే యీ శక్తిని గూడ నారాధించు చుందురని జెప్పిరి. అప్పుడు వారు మిక్కిలి వెరఁగుపడుచు నాదుర్గ గుడిలోనికిం జనిరి. అందున్న శాక్తేయు లెదురువచ్చి తోడ్కోనిపోయి దుర్గాదర్శనముఁ జేయించి అయ్యా! ఈమె మహాశక్తి ప్రపంచమంతయు శక్తి మయము. శక్తిలేక యేకార్యము చేయలము గదా. సృష్టికి బూర్వ మీమె యొక్కరితయే యుండునది. తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నీమెయే సృష్టించినది. సర్వదేవతలతోఁ ద్రిమూర్తులు వచ్చి ప్రతిదినము సాయంకాల మీశక్తి ముందరఁ దాండవము సేయుచుందురు. ఈమె కన్ను విప్పిచూచిన లోకములన్నియు భస్మము కాఁగలవు. ఈమెకు మూఁడు కన్నులున్నవి. పెక్కేల? ఈ శక్తినే జనులెల్లరు నారాధింపవలయును. అని పెక్కు శ్లోకములు చదివి వారు మనసు సమాధానపడునట్లు చేసిరి.

ఆ మాటలన్నియు వినుటచే వారి హృదయములు వ్యాకులములైన నేదియు నిశ్చయింపనేరక యింటికి బోయిరి. ఆ రాత్రి బుధవర్మ పుత్రుల యొద్దకుఁబోయి వత్సలారా! మీరు మన పట్టణ విశేషణములన్నియు జూచి వచ్చితిరా? లోకవ్యవహారములు బోధపడుచున్నవియా? యని యడిగిన వారు తండ్రికి నమస్కరించి యిట్లనిరి.

తండ్రీ! మేము మొదట నంగటికిం బోయితిమి అందు వ్యాపారము చేయువారు పరోపకారపారీణులని సంతసించితిమి కాని వారు స్వార్థపరులని విని వారి వృత్తి నిరసించితిమి. అది యట్లుండె తరువాత విష్ణ్వాలయమునకుం బోయితమి. అందున్నవా రాస్వామి జగత్కర్తయని చెప్పిన నమ్మి సేవించితిమి. మఱునాఁడు రెండవ వీథిలో శివాలయము కనంబడినది. అందలి వారలు శివుఁడే సర్వోత్తముఁడని పెక్కు శ్లోకములు చదివిరి. తరువాత దుర్గగుడికిఁ బోయితిమి ఆ శక్తి వీరిద్దరింగన్నదనివారు చెప్పిరి దీనిలో నేదినిజము ? ఎవ్వరి నారాధింతుము ? పరస్పర భేదములు మనుష్యులతో గాక దేవతలలోఁ గూడ నున్నవియా ? ఇందలి నిజము మీరు జెప్పవలయు యబద్ధము జెప్పినవానిం దండింతుమని యడిగిన విని బుధవర్మ యిట్లనియె.

వత్సలారా ! ఈ తగవు చిరకాలము నుండి యున్నది. ఇప్పుడు తీరునది