పుట:కాశీమజిలీకథలు -04.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళావతీసుందరుల కథ

335

మంగళమహశ్రీవృత్తము

స్వస్తియగుఁగాత బుధజాతమున కెప్పుడు ప్రజావితతిభూపతతి ధర్మన్యస్త మతిఁబ్రోవుతఘనంబు గఘనంబులు చితావసరమందు నసువృష్టుల్ నిస్తులముగాఁ గవిభు నించుతధరాస్థలి ఫలించుత సుమంగళ మహాశ్రీ విస్తృత గతిన్సభివృద్ధిమనుగాత సురభివ్రజము వత్సవములతోడన్.

గీ. హవ్యవాహనగుణ వారణాంబుజారి
    సంఖ్యనొప్పారు వరశాలిశకమునందు
    దనరుచుండ విరోధికృద్వత్సరమున
    దీని రచియించి ప్రకటించితిని ధరిత్రి

గద్య. ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదితకవితా విచిత్రాయ

మునిసుత్రామగోత్ర పవిత్ర మధిర కులకలశ జలనిధి రాకాకు

ముదమిత్రలక్ష్మీనారాయణ పౌత్రకొండయార్యపుత్రసోమి

దేవీగర్భశుక్తిముక్తాఫల విబుధజనాభిరక్షిత సుబ్బన

దీక్షితకవివిరచితంబగు కాశీయాత్రావసథచరిత్ర

మను వచనప్రబంధమందు చతుర్థభాగము

సంపూర్ణము

శ్రీ శ్రీ శ్రీ

ముద్రణ :

శ్రీ లక్ష్మీ గణేష్ ప్రింటర్స్

విద్యాధరపురం, - విజయవాడ 12.