పుట:కాశీమజిలీకథలు -04.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40]

దేవగుప్తుని కథ

313

తువో చెప్పుము. పూర్వపక్షము చేయుదునని పలికెను. అప్పుడు వారికిట్లుసంవాదము జరిగినది.

వసుంధరుఁడు - అయ్యో ! పేరు చేతను గూడ మీరు బెద్దన్నలు గదా లోక పితామహులు వృద్ధులతోఁ బరిహాసము లాడరాదు. మీ రించుక విశ్రమింపుఁడు.

పెద్దన్న - నీవు వాచాలుఁడగుదువు సంతసించితిమి నన్నుఁ గెలిచి నీ యౌవన గర్వము చూపుము.

వసుం - మీ రొక్క పద్య మెన్ని సంవత్సరములకుఁ జెప్పుదురు ?

పెద్దన్న - అట్లడిగెదవేల గడియకు నూఱుపద్యములు చెప్పఁగలను.

వసుం - ఏమీ ? గడియకే నూఱుపద్యములు : అందులకేనా అఱువది యేండ్ల కారువందల పద్యములు గల మనుచరిత్ర మొక్కటి రచించితిరి నేనుదాని బట్టి విభజించి సంవత్సరమునకుఁ బది పద్యములు చెప్పఁగలరని నిశ్చయించితిని.

బెద్దన్న - అఱువదియేండ్లు మనుచరిత్ర మొక్కటియే రచింపుచుంటి ననుకొంటివా ?

వసుం - పోనీ ! మీరు రచించిన మఱియొక గ్రంథము పేరు చెప్పుడు.

పెద్దన - అవసరము లేక మఱియొక గ్రంథము రచించలేదు.

వసుం - అవసరమెవ్వరికి మీకా ? ప్రజలకా ?

మీరు పుట్టకపూర్వము మీ గ్రంథము లేని యప్పుడు ప్రజలు బ్రతికి రాలేదా ? మీ రొక్కరే కాదు. మీ గజములందఱు నొకటి రెండు గ్రంథములు మాత్రము రచించి మా పాటి పండితుఁడు లేరని విఱ్ఱవీగుచున్నారు. మూడాశ్వాసముల రాజశేఖర చరిత్రమను నొక చిన్న గ్రంధము రచించిన నీ మల్ల న్న యుగజమే ఔరా ! యెంత చిత్రము మదము గలుగుటచే వీరికాపేరులు సార్ధకముగా నున్నవి. మీరు రచించిన గ్రంథములు నేనాకుగా నిప్పుడు రచించెద వ్రాసికొనుఁడు.

మఱియు రామలింగకవిగారు మందారవల్లి ని జయించిన విధానమంతయు మాకు బోధపడినది. వారు పూజ్యులు వారి నేమియు ననరాదు. దేవసాగర లిపితో నున్న గ్రంధములేమైన నిచ్చటికిఁ దెచ్చిరేమో నాకా భాష వచ్చును. అయ్యారే! యొక తొయ్యలికి నోడిపోయి వేషములు మార్చుకొని యాఁడువాండ్రై బధిరభారము వహించి పొరటిల్లి న మీరు మఱల సిగ్గు విడిచి దిగ్విజయము చేయవచ్చితిరే ? ఇంతకన్న నవివేక మెందైనం గలదా ? మీ గ్రంధములలోఁ బద్యమునకు నూఱు తప్పులు పట్టెద సమాధానము చెప్పుడు ఏ శాస్త్రములో వాదింతురో చెప్పుడు. పూర్వపక్షము చేయుదురా? సిద్ధాంతము చేయుదురా ? యని మేధుగంభీర భాషణంబులఁ బ్రతివాదులెల్లఁ --------- చూచుచుండ సకల శాస్త్రసయుక్తి యుక్తి ప్రకారములచే దద్గ్రంధస్థ శబ్దార్థదోషంబులెల్ల దెల్ల మగునట్లు చక్కఁగా నుపన్యసించెను.