పుట:కాశీమజిలీకథలు -04.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

లలిత కథ

223

అయ్యో ? నిష్కారణము నొకరి కపకారముఁజేసి జీవింప నేమిటికి ? సఖీ ! మనల నీ పాతకమెట్లు పాయునని యెన్ని యో చెప్పి యూరక వగచుటయు నవ్వుచు నా జవ్వని యిట్లనియె.

నెలఁతుకా ! కల కిట్లుకలంగెద వేల? చాలు చాలు ? నీ వింత బేల వని యెఱుంగనై తినే యెవ్వరైన వినిన నవ్వుదురు సుమీ. నా తెచ్చినవార్తనీకల ననుసరించియే యున్నది. విను మాపురుషసింహుండ లోకసామాన్యుఁడని చెప్పవలసినదే. నేను రాత్రి వానియింటి కురంగటి వారల వానిగుణంబుల నడిగి తెలిసికొంటి నాహా! తదీయౌదార్య గాంభీర్యచాతుర్యాదిగుణంబు లేతన్మాత్రములు కావఁట. సత్యసంధుండన వానినే చెప్పవలయునఁట. వానికిఁగల దాతృత్వము కర్ణునికి లేదని చెప్పిరి. ఆ గోవాళ్ళు పల్లెవానికి జాలములో దొరికెనని యావీధివారందఱికిం దెలియును. మఱియు నేనందుఁ దిఱుగుచుండ నొక కోడెకాఁడు వచ్చి నా మొగ మెగాదిగఁ జూచి నీపేరు తిలక కాదా? యని అడిగిన, ఔను దిలకనే. నన్ను నీ వెట్లెరిఁగితివని యడిగితిని. అప్పుడు వాఁడు నీ మాటలం బట్టి, గురుతుఁబట్టితిని. నా స్నేహితుఁడు పుష్పహాసుఁడు విదేశమున కరుగుచు నిన్నుఁ దెలిసికొని రహస్యముగా నీ పత్రిక నీకిమ్మని చెప్పి యది నాకిచ్చెను. నేను నీజాడ నరయుచుండ దైవికముగా నీ విక్కడఁ గనంబడితివి. ఇదిగో యుత్తరము పుచ్చుకొమ్మని పలికి యతండది నాకిచ్చి యవ్వలికిం బోయెను. అని చెప్పువఱకు నాయొప్పులకుప్ప చెప్పునఁ గనుఱెప్పలు విప్పుచు నేదేది ? అది నీవిచ్చటికి దెచ్చితివా ? తెమ్ము తెమ్మని తొందరపడ నత్తెఱవ యయ్యుత్తర మత్తరుణి కిచ్చినది. అదివిప్పి యప్పడఁతి యిట్లు చదివినది.

మ. తరుణ: దూరము బోవుచుంటిని, భవ • త్సల్లాపభావప్రవృ
     త్తరసావేశముతో విదేశమునఁ ద్వి • ద్ధత్తోపచారక్రియా
     స్మరణంబొప్పఁగఁ బ్రాణధారణవిధి • స్వల్పం బ్రయత్నించెదన్
     మఱువన్ శక్యమె? తావకోహిత స . న్మానంబు లెన్నాళ్ళకున్.

అను పద్యమును ముమ్మాఱు చదువుకొని యమ్మదవతి ధృతి నాపలేక యా లేఖ తిలకపయింపబడ వైచి, వేఁడినిట్టూర్పులు నిగుడింపుచు అయ్యో ! వానికి మన మేమి సన్మానములు చేసితిమి ? మనమాటలే తలంచుకొనుచుఁ బ్రాణధారణముఁ జేయునఁట. పాప మిట్టి యిక్కట్టు తెచ్చి పెట్టితిమి. ఇప్పుడు కర్తవ్యమేమి ? యని యడిగిన నాతిలక కలికీ ! పత్రికలోనున్న సే విశేషములు సూడక నాపైఁబాఱవైచితి వేల? విను మతండు ప్రయాణు నే " ప్రకారమంతయు నిందుఁ డు మూ... మ... న్న పరపాదహిందు ను i, ఏం. avis... - సేది. సాభిప్రాయముగాఁ మనం .. అని అంటే సియ... న యఁడు మనల నచ్చటికి రమ్మని యభిప్రాయము. .