పుట:కాశీమజిలీకథలు -04.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అయ్యారే ! యిట్టిపాపని మాయట్టి చక్రవర్తుల కులంబునం బుట్టింపక నికృష్ట కులంబునం బుట్టించిన పరమేష్టి డిట్టినఁ దప్పేమి ! ఇసిరో ! విధాత మెప్పుడు నసదృశకార్యంబులే చేయుచుండునని తలంచుచు నోరీ ? వీఁడు నీకొడుకే ? అని యడిగిన వాఁడు స్వామీ ! దేవరదాసుఁడు వీఁడు నాకొడుకే యని యుత్తరముఁ జెప్పెను.

అప్పు డప్పాపని దాపునకు రప్పించుకొని రాజు వాని బుగ్గల నల్లన లేఖినిం బొడుచుచు నోరీ ? బాలకా ! నీపేరేమని యడిగిన వాఁడు నగుచుఁ బుష్ప హాసుఁడని యుత్తరముఁ జెప్పిన విని యతండోహో ! మంచి పేరే పెట్టితివే. వీని నవ్వే వీని పేరు చెప్పుచున్నదిగదా! అని మెచ్చుచు నోరీ ! గుహుఁడా ! నీవేమిపనికై వచ్చితి వని యడిగిన గుహుండు మెల్లనఁ దన తలపాగలో మడిచి యుంచిన రత్న కంకణ మొకటి పైకిఁదీసి ఱేని ముందర నిడి యిట్లనియె.

క. గాలమిడ గండ నేఁడొక
   మేలగు మీనంబు దొరకె మేమది గోయం
   గ్రాలుచున్నది తదుదర
   గోళంబున వలయుమిది యకుంఠితరుచులన్.

సామీ ! యిది మాబోఁటివారు ధరింప నర్హులు కారనిదేవరకుఁ గానుకగాఁ దీసికొనివచ్చితినని చెప్పెను. అప్పుడా యేకిమీ డాకంకణముఁ గై కొని త్రిప్పిచూచి యందలి విలాసమరసి పరికించి హా ! గంధర్వదత్తా ! హా ! సహోదరీరత్నమా ! నిన్నుఁజూచి యెన్నిదినములైనదే. అయ్యో ! నీ సౌందర్యమంతయు నీటిపాలైనది కాఁబోలు. అక్కటా ! నీకాపుర మెంతలో మాయమైపోయినది. అయ్యారే ! నీ రాజ్యము గంధర్వనగర ప్రాయమైనదె యని శోకించుచుండ నర్మసఖుండు దేవముఖుండను బ్రాహ్మణుఁడు దేవా 1 యిదియేమి ? యకారణముగా శోదరిం దలంచికొని విచారింపుచున్నారు. వగపు నిరర్థకమని యెఱుఁగరా ? యని యోదార్చిన రాజిట్లనియె.

వయస్యా ! ఇది మన గంధర్వదత్తకంకణము. ఈపల్లె వానికిఁ మత్స్య గర్భంబున దొరికినదఁట చూచితివా ? దీనిం బట్టిచూడ మనవారు గంగానదింబడి సమసిరని తలంచెద. నాఁటిరాత్రి వారుప్పరిగపైఁ బండుకొనిరని చెప్పినమాట విశ్వసింపఁదగియుండలేదు. అందేమి కాపట్యమున్నదో తెలియదు. ఎటులయిననేమి యల్పకాలములో విధి చలపట్టి మూఁడు ప్రాణంబుల గావు పెట్టెను. మన లలిత జనించినప్పుడు తనకుఁ గోడలుగలిగినదని యది బ్రహ్మానందము పొందినది. ఏముచ్చటయు దీఱినదికాదని వగచుచు నావలయము లలిత కిమ్మని ------------- నంతఃపురమునకుఁ బంపి యతండు గన్నీరు దుడిచికొనుచు గుహున కిట్లనియె

నిషాదపతీ ! నీవీవస్తువు దాచుకొనక తెచ్చి మాకిచ్చినందులకు మిగుల