పుట:కాశీమజిలీకథలు -04.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యాచిన్నదాని మాకప్పగించితి. మావాండ్రు నీ మహిమం దెలిసికొ'నలేక నిన్నుఁ దల్లితో నూఁతిలోఁ బడద్రోసిరి. ఆ పాతకమునకు ఫలం భనుభవించుచున్నారు. ఇప్పుడేమైపోయిరో తెలియదు నీవు విక్రమార్కుని మనుమఁడవని తరువాత వింటిమి. మాప్రారబ్దమిట్లున్నది. దిక్కుమాలినవాఁడనై తిరుగుచున్నాఁడనని విచారింపఁగా విని పరితపించచు విజయభాస్కరుండు "బ్రతికియున్నచో మీవాండ్రఁదీసికొనివచ్చి యప్పగింతు. నీవు దుఃఖింపవలద"ని యోదార్చెను. ఆ యుత్సవానంతరము నుజ్జయినికిఁ బోవుటకుఁ గీర్తికేతుఁడు తొందరపెట్టెను. గిరిమస్తక మస్తకముపై కొండపై నెక్కినట్లు చతురంగబలములు సామంతులు బంధువులునెక్కుటయు నది మెల్లగా నడువఁజొచ్చినది. విజయభాస్కరుఁడట్లు దిగ్విజయముఁజేసి సకల బంధురాజ సహితుండై యిరువురి భార్యలతో నుజ్జయినికిఁ బయనము సాగించుచు దారిలో నొక చోట విడిసి గిరిమస్తక నయ్యడవినంతయు బెఱికివేయుమని యాజ్ఞాపించెను. ఆ రక్కసియు ముహూర్తకాలములో నయ్యరణ్యమంతయు నరికి ప్రోగులు పెట్టినది. పిమ్మట స్కంధంబులఁ బరీక్షఁ సేయించి యొక్క చెట్టుమొదట సోపానములు గనంబడుటయు నా రాజపుత్త్రుఁడు కతిపయపరివార సహితుండై యాపాతాళమందిరమున కరిగెను. అందు శక్తిగుడిముంగిట బశువులవలెఁ గట్టబడియున్న నిగమశర్మయుఁ దల్లి యు సోదరులుం గసంబడిరి.

రాజపుత్త్రుండు సామంతరాజులకుఁ దగ్గృహ వృత్తాంతమంతయుం జెప్పి నిగమశర్మను సోదరులతోఁగూడ బంధవిముక్తులంగావించి తండ్రితోఁగూర్పెను. పిమ్మట నా చోరులనెల్లఁ బట్టికొని బుద్ధులంజేసి యందుగల ధనరాశులన్నియు గోనెలనెక్కించి గిరిమస్తకమస్తకముమీదఁబడవేసి వెండియుం బయనము గావించెను. రాజకుమారుఁడు గావించిన కృత్యములన్నియు వారెల్ల నద్భుతముగాఁ జెప్పుకొనుచుండిరి. అట్టి మహా వై భవముతో నుజ్జయినికింబోయి శుభముహూర్తంబున నారాజపుత్త్రుండు పట్టాభిషిక్తుండై యశస్కరుఁడు చంద్రావలోకుఁడు లోనగు రాజులఁ బెద్దకాలము దనయొద్ద నుంచుకొని తగు సత్కారములు గావింపుచు వారి వారి నెలవుల కనిపెను. గిరిమస్తకయను రక్కసి కామరూపిణి కావున దాను దలంచినప్పుడువచ్చి కార్యములు నెరవేర్చి వెళ్ళుచుండవలయునని కోరికొని యప్పుడా సముద్రగృహమున కనిపెను. నాటం గోలె విక్రమార్కునికి బేతాళుండువోలె నారక్కసి విజయభాస్కరుండు తలంచినప్పుడువచ్చి కార్యములుసేసి యరుగుచుండునది. కలభాషిణియు హేమప్రభయుఁ దన కెక్కుడు సంతసము గలుగజేయఁ జారుమతి నీతిబోధ సేయుచుండ విక్రమార్కునికన్న నెక్కుడు ధర్మముగా విజయభాస్కరుండు రాజ్యముఁ బాలింపుచుండెను.

గోపా ! యప్పుడా గిరిమస్తక దంత మొక్కటి రాపిడిచే నూడి యా యెడదలోఁ బడిపోయినది. అదియే నీకిప్పుడు దొరికినది. పూర్వమిది చాల పెద్దదిగా నుండునది. పోయిపోయి మన్నై యిప్పుడింత మాత్రము మిగిలినది. ఇదియే దీని