పుట:కాశీమజిలీకథలు -04.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23]

మంజువాణి కథ

177

అప్పుడా రాజు నిన్ను మేమంతఃపురములోఁ గాపు పెట్టితిమి గదా ? మా సెలవు లేనిదే నీవేమిటి కిట్లు వచ్చితివో చెప్పుమని యడిగిన నతండది నాదియే తప్పు. అందులకు నన్ను శిక్షింపుఁడని యుత్తరముఁ జెప్పెను. పిమ్మట రాజు 'కానిమ్ము. నీవు చేసిన తప్పిది యొక్కటియే కాదు. చాలగలవు, విచారించెదను. సభకు రమ్మని” పలికిన నతండించుకయుఁ గలఁతనొందక చిత్తము చిత్తము, ఇదె వచ్చుచున్నానని యతని వెంట నడువఁజొచ్చెను రాజు వానికి మంత్రి శరీరమును జూపి వీనినిట్లెవ్వరు చంపిరో యెఱుంగుదువా ? యనుటయు నది దైవమునకుఁ గాక యొరులకుఁ దెలియునా? యని యుత్తరముఁ జెప్పెను.

తరువాత సభకుఁ దీసికొనిపోయి మంజువాణి సఖురాలు మదనమంజరికను రప్పించి నిన్న రాత్రి నితండేమి చేసెనో చెప్పుమని యడిగిన నా చెడిపై సభ్యులెల్ల రు విన నిట్లు చెప్పినది. అయ్యా ! యీ చిన్న వాఁడు మా యమ్మగారి మేడలోపలికి వచ్చెను. నేను గదిముంగిటఁ గూర్చుంటి. నన్ను జూచి మంజువాణి యెందున్నదని యడిగెను. నీ కామె పనియేమి యున్నది ? లోపల నున్నారని చెప్పితిని. అవసరముగా మాటలాడవలయునిటు రప్పింపు మనుటయు నిజమనుకొని నేను దీసికొని వచ్చితిని. ఆమెం జూచి యాతండు నాకు దాహమగుచున్నది. యిచ్చెదవా ? యని యడిగెను. ఆమె నన్నిమ్మని సన్నఁజేసినది. అది యొరులిచ్చునది కాదు. నీ యధరామమృత మిచ్చినం గాని నా దప్పిదీఱదనిపలికెను. ఛీ: నీచా : అట్టిమాటలు ప్రేలెద వేల ? పో పొమ్మని యామె పలికి లోపలికిఁ బోవుచున్నంత వెనుక నరిగి యామె చేయి పట్టుకొని లాగెను. నేను బోయి వెనుకకు లాగితిని ఆమెయుందిట్టినది. అప్పుడు కోపము వచ్చి కత్తి దీసికొని మమ్ము నఱకఁ బోయెను. మేము కేకలు వై చినంతట బాఱిపోయెను - అప్పుడు నా చెల్లెలిచే మంత్రి కా వార్తం తెలియఁ జేసితిని.

అతండు వోయిన నాకత్తిచే నఱికి యతని యంగము కందకములోఁబాఱవై చెనఁట ఇదియే జరిగిన కృత్యమనిచెప్పినది. అప్పుడు రాజు వానింజూచి పుణ్యాత్మా ? యిది చెప్పిన మాటలు వింటివిగదా ? దీని కేమి యుత్తర మిచ్చెదవని యడిగిన నా రాజపుత్రుండు వెరగందుచు ఆహా ! స్త్రీ లెట్టిపనులకైన సాహసము గలవారు గదా ? ఇప్పుడు నేను యదార్ధముఁ జెప్పినను రాజు నమ్మఁడు నమ్మినంత నీ కాంతంజంపును. భార్యాభర్తలకు వియోగముఁ జేసినవాఁడనగుదును. నేను బ్రతికి యుండిన నేమి ప్రయోజనము? అని తలంచుచు నేమియుం బలుక యూరకుండెను. రాజు మఱల దీని మాటలకుఁ సమాధానము జెప్పవేమి ? యీ యపరాధముఁ జేసిన ట్లొప్పుకొనియెదవాఁ యని యడిగినఁ జిత్తము. ఒప్పుకొంటినని యుత్తరముఁ జెప్పెను. క్రమ్మిరమంత్రిని? గూడ నీవే చంపితివి కాదా ? యనుటయుఁ గారకుండను నేనే యని యుత్తర మిచ్చెను.

అప్పుడు రాజు మిగులఁ గోపించుచుఁ ద్రోహీ ! నీవు లనె పూసిన కత్తి